పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారత స్వాతంత్యోద్యమం ముస్లిం మహిళలు

సమావేశాలు ఏవి జరిగినా, అవి ఎన్ని రోజులు జరిగినా ఆ కార్యక్రమాలకు హాజరయ్యే ప్రతి యోధుడికి డాక్టర్‌ అన్సారి ఇంట ఆతిధ్యం లభించేది. ఆ కారణంగా ఆయన గృహం Dar-Us-Salam జాతీయోద్యమకారులందరికి అతిధి గృహంగా ఉండేది. Dar-Us-Salam లో ఉద్యమకారులకు అన్ని సదుపాయాలు కల్పించటం జరిగేది. ఆ సందర్బంగా షంషున్నీసా బేగం సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరికీ వారివారి అవసరాలకు తగ్గట్టుగా వసతి, భోజన ఏర్పాట్లు చేసేవారు. అతిధాులెవ్వరికీ ఎటువంటి అసౌకర్యం కలుగకుండ ప్రణాళికాబధంగా ఆతిధ్యాన్ని, ఇతర సదుపాయాలను కల్పించటంలో ఆమె శ్రదవహించారు.

ఢిల్లీకి వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన స్వాతంత్య్రసమరయోధులకు వారివారి అవసరాలు, అలవాట్లను బట్టి ఏర్పాట్లు చేయటంలో ఆమె ప్రత్యేకత చూపారు. మాంసాహార, శాకాహార, యూరోపియన్‌ భోజనం ఇష్టపడే వారికి ప్రత్యేక శిబిరాలు ఉండేవి. అతిదుల కోసం శిబిరాల ఏర్పాటు ఎక్కడోకాకుండ Dar-Us-Salam లోని విశాలమెన ఆవరణలో ఏర్పాటు చేసి వారికి ఎటువంటి అసౌకర్యం జరగకుండా జాగ్రతలు తీసుకున్నారు. ఏ ఒక్కరి విశ్వాసాలకు, మనోభావాలకు భంగం కలుగకుండ చూసుకున్నారు. ఈ ఏర్పాట్లకు ఆమెకు తగినంత ధనం సమకూర్చటం డాక్టర్‌ అన్సారి వంతైతే, ఏర్పాట్ల నిర్వహణ, పర్యవేక్షణను బేగం అన్సారి తన భుజస్కంధాల మీద వేసు కుని శ్రమించారు. ప్రతినిధు ల శిబిరాల నిర్వహణాభారాన్నిఅతిధు లు ఆశ్చర్యపోయేలా సమర్థవంతగా నిర్వహించటం ఆమె ప్రత్యేకత.

షంషున్నీసా బేగం అంతి బృహత్తర కార్యక్రమాన్ని ఎంతో సమర్ధవంతంగా నిర్వహించటం ద్వారా మహాత్మాగాంధీని కూడ ఆశ్చర్యచకతుల్ని చేశారు. జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు జరిగినన్ని రోజులు వచ్చేవారు, పోయేవారితో Dar-Us-Salam ధర్మ శాలను తలపింపచేసేది. ఆ కారణంగా 1931మార్చి 29నాటి నవజీవన్‌ పత్రికలో అన్సారి ధార్మశాల శీర్షికతో డాక్టర్‌ అన్సారి ఇంట అతిథ్యం లంభించే తీరు తెన్నులను, ఆయా కార్యక్రమాల నిర్వహణలో బేగం షంషున్నీసా చూపిన శ్రద్ధను ప్రశంసిస్తు గాంధీజీ ప్రత్యేక వ్యాసం రాసారు.

ఈ వ్యాసంలో షంషున్నీసా దాయాగుణాన్ని, సహనశీలతను, కార్యనిర్వహణా దక్షతనేకాక, ఆమె ప్రగతిశీల భావాలను ఎంతగానో కొనియాడరు. ఆ వ్యాసం చివరిలో,


127