పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం మహిళలు.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

స్వరూప స్వభావాలను, రాజకీయాలను అవగాహన చేసుకోవటం పట్ల అభిలాష. ఈ మేరకు సంతరించుకుబన్న పరిజ్ఞానం వలన ఆమె సమకాలీన రాజకీయాల గురించి భర్తతోపాటుగా మహాత్మాగాంధీ లాంటి మహానాయకులతో చర్చించటం జరిగింది. ప్రముఖ నాయకులతో అభిప్రాయాలను పంచుకుంటూ, తన వైఖరిని స్పష్టం చేయడానికి ఆమె ఏమాత్రం వెనుకాడ లేదు . జాతీయ,అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు

తెలుసుకుంటూ భర్త అభిప్రాయాలను కూడ ప్రభావితం చేసిన ప్రతిభావంతురాలు.

1921నాి ఖిలాఫత్‌ ఉద్యమ కార్యక్రమాలలో పాల్గొనటం ద్వారా ఆమె జాతీయోద్యమ రంగప్రవేశం చేశారు. జాతీయోద్యమంలో బేగం షంషున్నీసా, డాక్టర్‌ అన్సారి బహుముఖ పాత్ర నిర్వహించారు. ఢిల్లీ ఖిలాఫత్‌ కమిటీ మహిళా విభాగం అధ్యక్షురాలుగా ఆమె సేవలందించారు. డాకర్‌ అన్సారి ప్రత్య క్ష కార్యకలాపాలలో పాల్గొంటే షంషున్నీసా బేగం పర్దానషీ మహిళ అయిఉండి కూడ బృహత్తరమైన బాధ్యతలను నిర్వహించి మహాత్మా గాంధీజీ నుండి ప్రేమాభిమానాలందుకున్నారు. ఆమె ముస్లిం మహిళలలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయాధులు, అలీ సోదరుల మాతృమూర్తి ఆబాది బానో బేగం ఢిల్లీ వచ్చిన సందర్భంగా మహిళలతో ప్రత్యేక సమావేశాలను నిర్వహించి ఖిలాఫత్‌ ఉద్యమం కోసం రెండువేల రూపాయలకు పైగా విరాళాలను వసూలు చేసి ఆమెకు అందజేశారు.

భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలలో ఆమె ప్రత్యేక ఆసక్తి చూపారు. అన్సారి తోపాటుగా ఆమె కూడ ప్రతి సమావేశానికి హాజరయ్యేవారని INSIDE INDIA గ్రంథాంలో రచయిత్రి HALIDE EDIB పేర్కొన్నారు. డాక్టర్‌ అన్సారి ప్రారంభించిన Anjuman-i-Khuddam-Kaaba కార్యకలాపాలలో ఆమె కీలకపాత్ర వహించారు. ఆధునిక విద్యావిధానాలు, సాంప్రదాయక విద్యాపద్ధతుల మధ్యన సమన్యయం ఏర్పరచడానికి, మక్కాలోని పవిత్రస్థలాలను పరిరక్షించి అభివృద్ధి పర్చేందుకు సాగిన కృషిలో తోడ్పాటునందించిన ఈ సంస్థకు ఆర్థిక వనరులు సమకూర్చడనికి షంషున్నీసా బేగం ఎంతగానో శ్రమించారు.

జాతీయ కాంగ్రెస్‌ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ స్థాయి కార్యక్రమాలు ఏవీకూడ ఆమె భాగస్వామ్యం, సహకారం లేకుండా ఆరంభమయ్యేవి కావు. జాతీయ కాంగ్రెస్‌

126