సయ్యద్ నశీర్ అహమ్మద్ 60
ల మీద చేయాల్సిన 'జిహద్' (ధర్మ పోరాటం) గురించి చర్చించి మార్గం నిర్ణయించుకున్నారు.
స్వదేశానికి రాగానే సాగిన చర్చలు, ఎంచుకున్న జీవిత లక్ష్యాలకు అనుగుణంగా
హాజీ షరియతుల్లా ధార్మిక బోధన ప్రారంభించారు. తూర్పు బెంగాల్ ప్రాంతంలోని అనేక
గ్రామాలను సందర్శించారు. పలు పర్యటనలు జరిపారు. ఆయన ప్రబోధిస్తున్న పరిశుద్ధ
ఇస్లాం, సమానత్వం, సామాజిక న్యాయం అనే సూత్రాలు గ్రామీణ పేదవర్గాలను అమితంగా
ఆకర్షించాయి. ఆ ప్రబోధాల మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ఆయనకు భారీ శిష్యగణం
ఏర్పడింది. భారతదేశంలోని యితర సాంఘిక జనసముదాయల సంస్కృతి, సభ్యత,
సంప్రదాయాల ప్రభావం వలన ముస్లిం సమాజంలోకి చొచ్చుకు వచ్చిన ఇస్లాం వ్యతిరేక
ఆచార సంప్రదాయాలను తీవ్రంగా ఖండించారు. ముస్లింల నడకకు, నడతకు ఖురాన్
గ్రంథం మాత్రమే ప్రధాన ప్రాతిపదిక అని ప్రకటించారు. ఆ మేరకు ప్రచారం చేసారు.
గ్రంథంలో ప్రస్తావించని ప్రతి విషయం నిషిద్దన్నారు. సకారాత్మకంగా ఎటువంటి విధి
విధానాలను, ఆచారాలను పాటించాలో స్పష్టంగా పేర్కొన్నారు. భగవంతుని ఆజ్ఞల
సముదాయమైన ఖురాన్ గ్రంథానికి మించి, ముస్లింల జీవితాలకు మహత్తర మార్గదర్శకం
మరొకటి లేదన్నారు. ఇస్లాం మతం బోధించిన సమానత్వం, సోదరభావాన్ని విస్మరించటం
సరికాదన్నారు.
స్వదేశం విదేశీయుల పాలనలో ఉన్నందున, ఈ దేశాన్ని శత్రువు దేశంగా (Dar-
ul-harb) ప్రకటించి, అది విదేశీయుల నుండి విముక్తం అయ్యేంతవరకు, శుక్రవారం నాటి
ప్రత్యేక ప్రార్థనలు చేయరాదని, ముస్లింల రెండు ప్రధాన పండుగలను కూడా
జరుపుకోరాదన్నారు. ఈ దేశాన్ని శత్రుదేశం నుండి స్వదేశంగా (Dar-ul-Islam) మార్చాలని
ఆయన నిర్ణయించారు. ఈ గడ్డ మీద నుండి ఫిరంగీల పాలనకు చరమగీతం పాడేందుకు
సమాయత్తం కావాలని, ఆ లక్ష్య సాధనకు ఫరాజీలంతా కృషి సాగించాలని హాజీ షరియతుల్లా
ఆదేశించారు. ఈ విషయాన్ని ఆంగ్ల రచయిత Wilfred Cantwel Smith రాసిన Modern
Islam in India లో, ... they drew political conclusion that to convert this land as a
dar-ul - Islam the rule of firingi came to an end.., అని పేర్కొన్నారు.
హజీ షరియతుల్లా సాగించిన పర్యటనలు, ప్రబోధాలన వలన ఫరీద్ పూర్,
బాఖర్గంజ్, మైమ్సంగ్ తదితర ప్రాంతాలలో మంచి అనుచరవర్గం ఏర్పడింది. ఆయా
ప్రాంతాలలోని ముస్లింలు షరియతుల్లా అనుచరులుగా దీక్ష స్వీకరించారు. ఆయన ఆదేశిస్తే
ధనమాన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డారు. ఆయన ఆదేశాలను అనుసరించడానికి
సదా సిద్ధంగా ఉన్న అమితోత్సాహులైన కొందరు ఫరాజీలు పలు ప్రాంతాలలోని ఇతర
ముస్లింలతో ఘర్షణలకు పాల్పడ్డారు. గ్రామాలు, పట్టణాలలో శాంతి భద్రతలకు విఘాతం
ఏర్పడింది. ఈ కారణంగా ఫరాజీల నేత హాజీ షరియతుల్లాను బ్రిటీష్ ప్రభుత్వం పలుమార్లు
నిర్బంధించింది. బ్రిటీష్ వ్యతిరేకత దృష్ట్యా రెవిన్యూను జమీందారులకు చెల్లించరాదంటూ
ఆయన అనుచరులను కోరారు. ఈ కారణంగా ఆయనను అరెస్టు చేయటం జరిగిందని
ఆంగ్ల అధికారి జేమ్స్ టైలర్ రాసిన, A sketch of the Topography and statistics of