Jump to content

పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

61 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు

Dacca ( Calcutta 1840 ) లో పేర్కొన్న అంశాలను బట్టి చూస్తే స్పష్టమౌవుతుంది. జమీందారులు, ఇండిగో ప్లాంటర్లు, ఫరాజీలకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఫరాజీల ధార్మిక ఆచార సంప్రదాయాలతో ఏకీభవించని ఇతర ముస్లింలను రెచ్చగొట్టి, ఫరాజీలకు వ్యతిరేకంగా పురికొల్పారు.
⁠ఈ కుయుక్తుల కారణంగా 1831లో రాంనగర్ గ్రామంలో ఫరాజీలకు, జమీందారుల మద్దతుదారుల మధ్య కొట్లాట జరిగింది. ఈ సంఘటనను పురస్కరించుకుని ఇరువురు ఫరాజీలకు సంవత్సరం జైలు శిక్ష, జరిమానా విధించారు. హాజీ షరియతుల్లా మీద కూడా కేసు నమోదు చేసినా, ఎటువంటి సాక్ష్యం లేకపోవటంతో ఆయనను విడిచిపెట్టాల్సి వచ్చింది. అనంతరం ఢాకాలోని నవబారి (NAVABARI) గ్రామం నుండి ఆయనను బహిష్కరించారు. ఫరాజీలకు కేంద్రంగా మారిన నవబారిని వదిలి, పుట్టి పెరిగిన గ్రామానికి ఆయన వెళ్ళిపోయారు. ఈ సంఘటనలు ఫరాజీలను ఏ మాత్రం నిరుత్సాహపర్చలేదు. హజీ ప్రవచనాలు, ప్రబోధం వలన, ఆయా ప్రాంతాల సామాజిక పరిస్థితుల వలన ఫరాజీల సంఖ్య అనూహ్యంగా పెరగసాగింది. ఫరాజీల సంఖ్య పెరిగేకొద్ది వారిలో ఆత్మస్థైర్యం పుంజుకోసాగింది. నిర్మాణపరంగా ఫరాజీలు సంఘటితం కాసాగారు.
⁠జమీందారుల అకృత్యాలను సహించలేని ఫరాజీలు, శత్రువును ధైర్యంగా ఎదుర్కోటానికి సమాయత్తమయ్యారు. ఈ వాతావరణంలో జమీందారుల, కంపెనీ అధికారుల పెత్తనం దోపిడి చర్యల వలన బాధలు అనుభవిస్తున్న గ్రామీణ పేద రైతాంగం ఫరాజీల వెంట నడిచారు. ప్రమాదాన్ని పసిగట్టిన జమీందారులు ఫరాజీలను వ్యతిరేకించే ఇతర సంప్రదాయాల ముస్లిం పెద్దలను, వడ్డీవ్యాపారులను, సంపన్నులను ఏకం చేసారు. ఫరాజీలను నిలువరించకపోతే రానున్న ఇక్కట్లను గుర్తెరిగి, ఫరాజీల చర్యలను ఎదుర్కొనడానికి ఉద్యుక్తులు కాసాగారు. జమీందారులు, వడ్డీ వ్యాపారులు వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక సాకుతో ప్రజలను హింసించసాగారు. ప్రజల మీద అణచివేత, హింస పెరిగే కొద్ది ఫరాజీ వ్యతిరేకశక్తులు ఊహించినట్టుగా కాకుండా అందుకు విరుద్ధంగా ఫరాజీల సంఖ్య, ఫరాజీలను సమర్థించే గ్రామీణ రైతుల, ప్రజల సంఖ్య పెరగసాగింది.
⁠ఫరాజీలపై అణచివేత, నిర్బంధాలు పెరగటంతో హాజీ షరియతుల్లా తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. అనుచరుల సంఖ్య పెరిగేకొద్ది జమీందారుల అణచివేతను, హింసను సహించలేకపోవటం, శక్తిగల ప్రాంతాలలో వ్యతిరేకించటం పరిపాటయ్యింది. పలు ప్రాంతాలలో ప్రతిఘటన పెరగసాగింది. ఈవిషయాన్ని Dr. James Wise 1894 లో హాజీ షరియతుల్లా మీద రాసిన ఒక వ్యాసంలో,.. Persecuted the more did he ( Ishrathulla ) become the symbol of a new awakening amongst the peasantry. During the next four years he was called upon to face tyrannical indigo planters, oppressive mahajans and Zamindars, whenever there had been a case to defend..', అని పేర్కొన్నారు.
⁠ఈ వాతావరణం మూలంగా గ్రామాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ పరిస్థితులను గమనించిన హాజీ షరియతుల్లా, ఘర్షణ వైఖరిని విరమించుకున్నారు. ఆధ్యాత్మిక వ్యవహారాల