చింతించుట, ఉపాయములను వెతకుట, ఉత్సాహము, వ్యవసాయము మొదలయినవి గలుగును.
అవహిత్థాలక్షణం
| అవహిత్థాకారగుప్తిః ధైర్యప్రాభవనీతిభిః. | 207 |
| లజ్జాసాధ్వసదాక్షిణ్యప్రాగల్భ్యాపజయాదిభిః, | 208 |
| కథాభంగాదయో౽ప్యస్యా అనుభావా భవంత్యమీ, | |
ధైర్యము, ప్రాభవము, నీతి, సిగ్గు, సాధ్వసము, దాక్షిణ్యము, ప్రాగల్ఫ్యము, అపజయము ఇవి మొదలయినవానిచేఁ గలుగు ఆకారగుప్తి అవహిత్థ యనఁబడును. ఇందు వేరుగఁ జెప్పుట, అబద్ధపుధైర్యము, మఱియొకప్రక్క చూచుట, కథాభంగము మొదలయినవి గలుగును.
ఉగ్రతాలక్షణం
| అపరాధాపమానాభ్యాం చౌర్యనిగ్రహణాదిభిః. | 209 |
| అసత్ప్రలాపనాద్యైశ్చ కృతం తూర్ణత్వముగ్రతా, | 210 |
| శిరసః కంపనం స్వేదవర్ధనం భర్త్సనాదయః, | |
అపరాధము, అవమానము, దొంగతనము, నిగ్రహము, అసత్ప్రలాపము మొదలయినవానిచేఁ జేయఁబడినత్వర ఉగ్రత యనఁబడును. అందు కన్నులు ముఖము ఎఱ్ఱనౌట, బంధించుట, కొట్టుట, తలయాడించుట, చెమట పోయుట, బెదరించుట మొదలయినవి కలుగును.
మతిలక్షణం
| నానాశాస్త్రార్థకథనాదర్థనిర్ధారణం మతిః. | 211 |
| అత్ర చేష్టాస్తు కర్తవ్యకరణం సంశయక్షిపా, | 212 |