పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

385

వెలమవీరులకాలమున వైష్ణవులకు నీక్షేత్రము వశమయ్యెను. కొలనుపాక హైదరాబాదునకు బెజవాడనుండి పోవు నినుపదారి మజిలియగు ఆలేరునకు నాలుగుమైళ్లుదూరమున నున్నది. ఇటగల వీరనారాయణాలయము దర్శనీయము. చిరకాలముక్రింద నిది జైనాలయమై యుండెను. క్రమముగా నది రూపుమాపఁబడుటచే వీరనారాయణస్వామి నిటీవల ప్రతిష్ఠించిరి. ఇప్పటికి నాలయమున జైనశాసన మొకటి దేవనాగరిలిపిలో వ్రాయఁబడినది గర్భాలయమునందుఁ గలదు. కొలనుపాకక్షేత్రవాసులు వీరనారాయణవిగ్రహము ఆలయమున కెదురుగా నున్న కోనేటిలోఁ బడిపోవ సంజీవకవి త్రోవ నేఁగుచు నీవార్త విని నూటయెనిమిది సీసపద్యములు చెప్పఁగా విగ్రహము ఒక్కొక్క పద్యమున కొక్కమెట్టు నెక్కి పైకి వచ్చినటులఁ జెప్పుదురు. ఇట్టికథలు చరిత్రముల కంతగా నుపయోగింపఁజాలవు.

సంజీవకవిపుస్తకము లింక నెన్నియో లభింపవలసియున్నవి.

ఇతఁడు బహుగ్రంథకర్త యని రుక్మిణీపరిణయమునందుఁ గలదు. ఈకవి వీరనారాయణముకుంద