పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

384


త్యుని గలసికొని తనకవిత నాతని నలరించి చెంతనున్న పొదలో వీరనారాయణ విగ్రహ ముంట దెలిసికొని పద్యములఁ జెప్పి ముందునకు రప్పించెనని చెప్పుదురు. మహమ్మదీయవిప్లవసమయమున స్థానికులు వీరనారాయణవిగ్రహమును కంపలలో దాఁచఁగాఁ బిదపఁ దనపలుకుబడి నుపయోగించి రాజసహాయమున సంజీవకవి యుద్ధరించె నని గ్రహింపనగును. వసుదేవనందనశతకము చంపకోత్పలమాలికలతో మనోహరముగా నున్నది. శోకమూరి బుచ్చనమంత్రి ప్రోత్సాహమున దానిని రచించినటులఁ గవి చెప్పికొనియున్నాఁడు. వీరనారాయణముకుందశతకము గునుగుసీసములతో నలరారుచున్నది. తిక్కన సోమయాజిసీసములవలె నిందలిపద్యములు వచనమువలె నుండి భావసమృద్ధిచే నలరారుచు పఠనార్హముగా నున్నవి. ప్రతిపద్యము చివరను మనోహరమగు నంత్యనియమము గలదు.

కొలనుపాక యనునది సుప్రసిద్ధజైనక్షేత్రము. తరువాత పశ్చిమచాళుక్యులలో నొకశాఖవారికి రాజధాని. కాకతీయుల కాలమున శైవులకు నావల