పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

డౌ
నీవే నిశ్చలబాంధవుండ వరయ న్నీవే మునిస్తుత్యుఁడౌ
నీవే శంకరమూలమంత్ర మరయన్‌ నీవే జగత్కర్తవున్‌
నీవే దిక్కనువారి వారలె కడు న్నీవారు నారాయణా! 96

మ. అపరాధంబులు నిన్ను నమ్మి విను మే నాజన్మపర్యంతమున్‌
విపరీతంబుగఁ జేసినాఁడ నిఁక నీవే దిక్కు నాలోనికిన్‌
గపటం బింతయు లేక దండధరుకుం గట్టీక రక్షింపు మీ
కృపకుం బాత్రుఁడ నయ్య ధర్మపురి లక్ష్మీనాథ నారాయణా! 97

శా. చెల్లం జేసితి పాతకంబులు మదిన్‌ శ్రీనాథ మీనామముల్‌
పొల్లుల్‌ బోవని నమ్మి పద్యశతమున్‌ బూర్ణంబుగాఁ జెప్పితిన్‌
చెల్లంబో నను నమ్మె వీఁడని దయం జేపట్టి రక్షింపుమీ
తల్లిం దండ్రియు నీవు గాక యొరులే తర్కింప నారాయణా! 98

మ. నరసిం హాచ్యుత వాసుదేవ వికసన్నాళీకపత్రాక్ష భూ
ధర గోవింద ముకుంద కేశవ జగత్త్రా తాహితల్పాంబుజో
దర దామోదర తార్క్ష్యవాహన మహాదైత్యారి వైకుంఠమం
దిర పీతాంబర భక్తవత్సల కృపన్‌ దీవింపు నారాయణా! 99

మ. కడకంటం గడలేని సంపద లొగిం గావింపు లక్ష్మీశ పా
ల్కడలిన్‌ బన్నగశాయివై భువనముల్‌ గ