పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శా. నీలగ్రీవుఁడు చేతిపున్క విడిచె న్నీయింతి భిక్షంబునన్‌
నీలగ్రీవుఁడు యీశ్వరాఖ్యఁ దనరె న్నీనామజప్యంబునన్‌
నీలగ్రీవుఁడు మించి త్రుంచెఁ బురముల్‌ నీప్రాపు సేవించినన్‌
నీలగ్రీవ ముఖాబ్జభాస్కర కృపానిత్యాత్మ నారాయణా! 92

మ. నిను వర్ణింపనివాఁడు మూఁగ మదిలో నీనామమున్‌ వీనులన్‌
విని మోదింపనివాఁడు చెవ్డు మరి నిన్‌ వేడ్కన్‌ మనోవీథినిన్‌
గని పూజింపనివాఁడు నాశకరుఁడౌ కర్మక్రియారంభుఁడై
తనలోఁ గాననివాఁడు నీచమతి పో తత్వజ్ఞ నారాయణా! 93

మ. నిను వర్ణింపని నీచబంధమతి దా నిర్మగ్నమూఢాత్ముఁడై
పెనుదైవంబులఁ గోరి తా మనమునన్‌ సేవించుచందంబు తా
నవలం బారిన భూతియందు వెలయ న్నాజ్యాహుతుల్‌ పూని వే
ల్చిన చందంబున వ్యర్థమై తనరు జూ చిద్రూప నారాయణా! 94

మ. నిను వర్ణింపని జిహ్వ దాఁ బదటికా? నీలాభ్రదేహాంగకా
నిను నాలింపని చెవ్లు దాఁ బదటికా? నీరేజపత్రేక్షణా
నినుఁ బూజింపని కేలు దాఁ బదటికా? నిర్వాహకక్ష్మాతలా
నినుఁ జింతింపని యాత్మ దాఁ బదటికా? నిర్వాణ నారాయణా! 95

శా. నీవే తల్లివి నీవె తండ్రి వరయ న్నీవే జగన్నాథుఁ