పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

భక్తబృందము వెంటఁబడి చరించెద రంచు
నెగసి పోయెడి పక్షినెక్కినావు
దాసులు నీ ద్వారమాసింపకుంటకు
మంచి యోధుల కావలుంచినావు
తే. లావు గలవాఁడ వైతి వేలాగు నేను
నిన్నుఁ జూతును నా తండ్రి నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 90

సీ. నీకథల్‌ చెవులలో సోఁకుట మొదలుగాఁ
బులకాంకురము మేనఁ బుట్టువాఁడు
నయమైన నీ దివ్యనామకీర్తనలోన
మగ్నుఁడై దేహంబు మఱచువాఁడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ
బ్రేమతోఁ దండ మర్పించువాఁడు
హా పుండరీకాక్ష! హా రామ! హరి! యంచు
వేడ్కతోఁ గేకలు వేయువాఁడు
తే. చిత్తకమలంబునను నిన్నుఁ జేర్చువాఁడు
నీదు లోకంబు నందుండు నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 91

సీ. నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు
లెస్సగాఁ బూజింపలేను సుమ్మి
నాకుఁ దోఁచిన భూషణములు పెట్టెదనన్నఁ
గౌస్తుభమణి నీకుఁ గలదు ముందె
భక్ష్యభోజ్యముల నర్పణముఁ జేసెద నన్న
నీవు పెట్టితి సుధ నిర్జరులకుఁ