పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యంభోజభవరుద్ర జంభారిసన్నుత!
సామగానవిలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్స కౌస్తుభవక్ష!
శంఖచక్ర గదాసి శార్ఙ్గహస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్యవినాశ!
నారదార్చిత! దివ్యనాగశయన!
తే. చారు నవరత్నకుండల శ్రవణయుగళ!
విబుధవందిత పాదాబ్జ! విశ్వరూప!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 88

సీ. నాగేంద్రశయన! నీనామమాధుర్యంబు
మూఁడుకన్నుల సాంబమూర్తి కెఱుక
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల
భారతీపతి యైన బ్రహ్మ కెఱుక
మధుకైటభారి! నీ మాయాసమర్థత
వసుధలో బలిచక్రవర్తి కెఱుక
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు
దశశతాక్షుల పురందరుని కెఱుక
తే. వీరి కెఱుకగు నీకథల్‌ వింత లెల్ల
నరుల కెఱుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస!
దుష్టసంహార! నరసింహ దురితదూర! 89

సీ. అంద ఱేమైన నిన్నడుగ వచ్చెద రంచు
క్షీరసాగరమందుఁ జేరినావు
నీచుట్టు సేవకుల్‌ నిలువకుండుటకునై
భయద సర్పముమీఁదఁ బండినావు