పుట:భక్తిరసశతకసంపుటము 3.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పీఠిక


ధర్మపురిరామాయణము, నృకేసరిశతకములను రచించిన శేషప్పకవిే ఈనృసింహశతకమును రచించెను. నృకేసరిశతకమునందుఁ గొంతవఱకుఁ గవిజీవితనివాసాదికములఁగూర్చి చర్చించి యుండుటచే నిటఁ దిరుగ నుదాహరింప మానితిమి. శతకప్రపంచమునం దీనరసింహశతకమునకు మంచిప్రచారము గలదు. స్త్రీబాలవృద్ధులు పలువు రీశతకమును బారాయణగ్రంథముగాఁ బఠించుటయుఁ బల్లెకూములలో నీశతకము పఠనీయగ్రంథముగా నియోగింపఁబడుటయు నీశతకప్రశస్తికిఁ దార్కాణములు.

ఈశతకకవితయందు లోపము లున్నను శైలి ధారళమూగా మనోహరముగా నున్నది. భావములు లలితముగా నున్నవి. నీతిపద్యములు కొలఁదిగ భక్తిపద్యములు మెండుగా నిందుఁ గలవు. పూర్వ