ఈ పుట ఆమోదించబడ్డది
278
భారతదేశమున
షరా: ఇది ప్రొఫెసర్ కె.టి.షా గారి లెక్క. దీనిప్రకారము స్పెషల్ అలవెన్సులు ఎంత అభివృద్ధిచేయబడినవో చూడుడు: ఈ అభివృద్దిగాక ఈఉద్యోగుల పింఛనులును సీమకు ప్రయాణ అలవెన్సులును చాలా అభివృద్ధి చేయబడినవి. ప్రభుత్వవ్యయము తగ్గించుటకు నియమింపబడిన ఇంచికేపుకమిటీ వారు 1922-23 లో కేంద్రప్రభుత్వాదాయము నుండి రైళ్ళ ఉద్యోగములుకు గాక తక్కినవారి కిచ్చుసొమ్ము (Staff) 1913-14 నాటికి 474966 నుండి 1922-23 లో 520762 కు అనగా నూటికి 10 వంతులచొప్పున హెచ్చుచేసిరి! ఈ అభివృద్ధి చాలకగాబోలును, లీకమీషనువారు అన్ని శాఖలయొక్క జీతములు, రెమిటెన్సు సౌకర్యములు, పింఛనులు, ఓడకేవుల అలవెన్సులు వృద్ధిచేయుటకు సిఫారసు జేసిరి!!
జీతములు, | రెమిటెన్సులు, | లక్షల రూ. |
I. C. S. | ఐ. సి. యస్. వారికి | 18.6 |
I. P. S. | ఇండియన్ పోలీసుశాఖవారికి | 12.7 |
I. M. S. | ఇండియన్ మెడికల్ శాఖకు | 7.0 |
I. E. S. | ఇండియన్ ఎడ్యుకేషనల్ విద్యాశాఖ (పురుషులు) | 3.3 |
I. F. S. | ఇండియన్ ఫారెస్టు సర్వీసు | 3.4 |
I. S. E. | ఇండియన్ ఇంజనీర్లు | 10.9 |
I. A. S. | ఇండియన్ ఆడిట్ (అక్కౌంట్లు) | 0.8 |
I. V. S. | ఇండియన్ వెటర్నరీ వారికి | 0.4 |
- | మొత్తం | రు. 57.1 |
- | ఓడకేవులు | 25.0 |