పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/769

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

279

ఇతరసర్వీసులకు 13 మొదలు 15 లక్షలరూ. వరకు ఐ. సి. ఎస్. వారి పింఛనులు 18 ల.

అన్‌కవెనెంటెడ్ శాఖోద్యోగుల పింఛనులు 1.2

అభివృద్ధిమొత్తము అన్ని బాపతులు వెరసి: రూ 96.21 లక్షలు మొదలు 98.21 లక్షల రూపాయిలవరకు నున్న ది.

IV

జీతముల పూర్వ చరిత్ర.

గవర్నరుజనరలుకును గవర్నరులకును ఐ. సి. యస్. మిలిటరీశాఖలందలి భారతదేశము యొక్క ఆంగ్లేయోద్యోగులకును అత్యధిక జీతములు బత్తెములు నొసగబడుపద్ధతి క్రొత్తగా వచ్చినదికాదు. గవర్నరు జనరలుకు గవర్నరులకును కార్యాలోచన సభలందలి మెంబర్లకును, జడ్జీలకును ప్రధమము నుండియు నీ పెద్దజీతములేయుండెను. మిలిటరీశాఖలోను సివిలుశాఖలోను కంపెనీ పరిపాలనారంభమున సామాన్యజీతము లుండెనుగాని క్లైవు వారన్ హేస్టింగ్సులు కొంత హెచ్చించిరి. ఉద్యోగులలో లంచగొండెతనము మితిమీరగా జీతవృద్ధి చేయుట యవసరమని కారన్ వాలిస్ ప్రభువు సిఫారసుచేయగా వీరి జీతములింకను ఎక్కువగా వృద్ధిచేయబడెను. 1858 లో నీ సివిలు మిలిటరీశాఖల ఉద్యోగనిబంధనలు సవరింపబడి జీతబత్తెములింకను వృద్ధిచేయబడెను. 1914 సం|| యుద్ధానంతరమిది మఱియు వృద్ధిచేయబడినది. 1921 లో మాంటేగూసంస్కరణములవలన తెల్లదొరలతోపాటు నల్లదొరలకుగూడజీతములు వృద్ధియయ్యెను. ఇదియే మన ఉద్యోగులజీతముల అభివృద్ధిచరిత్ర