పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/596

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
106
భారతదేశమున
 


మద్రాసు రాజధాని పరిపాలనముయొక్క వివరములను చూచినచో రాష్ట్రీయవిధానము తెలియును. ముగ్గురు సభ్యులుగల కార్యాలోచన సభాయుతుడగు గవర్నరునందు రాజధాని ప్రభుత్వము నెలకొల్పబడియుండెను. ఆసభలో నొకడు తత్కాలమునాటి సర్వసేనాని. గవర్నరులేనిచో “సీనియర్ మెంబ"రధ్యక్షుడు. ఈ మెంబర్లను రాణీ నియమించును. శాసన నిర్మాణముకొఱకు చేర్చుకొనబడు సభ్యులను గవర్నరు నియమించును. చీఫు శెక్రటరీ, రివిన్యూశెక్రటరీ, పబ్లికువర్క్సు శెక్రటరీ, నీటిపాఱుదల జాయింటు శెక్రటరీలు, క్రింద నలుగురు అండరు శెక్రటరీ లుండిరి. న్యాయవిచారణశాఖ, శాసన నిర్మాణశాఖకు ఒక అసిస్టెంటు శెక్రటరీకూడ యుండును. చీఫ్ శెక్రటరీక్రింద ఫైనాన్సు (ద్రవ్య శాఖ) న్యాయవిచారణ, విద్య, రాజకీయము, మతము, నావిక, శాసన నిర్మాణ పిటీషన్లు, శాఖలుండెను. రివిన్యూ శెక్రటరీక్రింద, రివిన్యూ పింఛనుశాఖలు, పబ్లికువర్క్సు సెక్రటరీ, నీటిపారుదల జాయింటు సెక్రటరీక్రింద పబ్లికువర్క్సు, పబ్లికువర్క్సు సెక్రటరీక్రింద రైల్వేలు, మిలటరీ సెక్రటరీక్రింద సైనికశాఖ యుండెను.

VI

ఐ. సి. ఎస్. ఊద్యోగి వర్గము

భారతదేశప్రభుత్వయంత్రమును నడుపునది. అనగా నీకోట్లకొలదిప్రజలను సాక్షాత్తుగా పరిపాలించునది సంస్థానాధీశులతో సాక్షాత్తుగా వ్యవహరించునది రమారమి 1200