Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/597

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బ్రిటీష్‌రాజ్యతంత్రము

107


సంఖ్యగల సివిలు మిలిటరీశాఖల ఆంగ్లేయోద్యోగులై యున్నారు. బ్రిటీషు ఇండియాలో 250 జిల్లాల పై గానుండెను. జిల్లా 1 కి 4430 చతురపు మైళ్లు. 9 లక్షల 31 వేల జనసంఖ్య దామాషాగానుండెను. ఈజిల్లాల పరిపాలనను ప్రభుత్వశాఖల లోని వివిధ వ్యవహారములను నిర్వహించునది ఈఉద్యోగవర్గమే. వీరికి "కవనెంటెడ్ సివిలుసర్వీసు" అనిపేరు. వీరుద్యోగమున చేరకపూర్వము ఇంగ్లండులో ఇండియామంత్రితో తమఉద్యోగ షరతులను గూర్చియు హక్కుబాధ్యతలు జీతభత్యములు పింఛనులు మొదలగు వానినిగూర్చియు ఒక “కవనెంటు" లేక ఒడంబడికను చేసికొనుట అనాదినుండి జరుగుచున్నందున ఈ ఉద్యోగ వర్గమున కా పేరువచ్చెను. నాటి ఆంగ్లేయ సివిలుసర్వీసు ఉద్యోగులెల్లరు తూర్పు ఇండియాకంపెనీనాటి ఫ్యాక్టరీల గుమాస్తాలు, ఏజెంట్లు, వర్తకులయొక్క. సంతతియని చెప్పవచ్చును. కంపెనీకాలములో నీ ఉద్యోగులు నిర్వహించవలసిన పరిపాలన వ్యవహారములకు తగిన శిక్షణముగాని తగు జీతములుగాని వారికి లేకుండెను. అందువలన లంచగొండెతనము స్వంతవ్యాపారము మున్నగు . దురాచారములు ప్రబలియుండెను. క్లైవు వారన్ హేస్టింగ్సులు ఈ ఉద్యోగులలోని అన్యాయములను కొంత సంస్కరించిరిగాని దీనిని నిజముగా చక్క జేసినది సద్దర్ముడగు కార౯ వాలిస్ ప్రభువు. వారిజీతములను హెచ్చించి వారిలో కొంతనీతి నియమమును స్థాపించెను.

ఈ కవనెంటెడు సివిలు సర్వీసులకు కంపెనీ డైరెక్టరులే ఉద్యోగులను నియమించుచుండిరి. 1793 లో కంపెనీ కివ్వబ