7
దిగవల్లి వేంకట శివరావు విరచితములగు
ఇతర గ్రంథములు
ఇంగ్లీషు తెనుగు పారిభాషిక నిఘంటువు. “వ్యవహార కోశము, శాస్త్ర పరిభాష" కలిసిన సంపుటము , అనేక పత్రికలవలనను విద్యాధికులవలనను ప్రస్తుతులందినది. పాఠ్యగ్రంధ నిర్ణయ సభవారివలన గ్రంథాలయములం దుంచుట కామోదింప బడినది. (చూ. 10-5-38 ఫోర్టుసెంటు జార్జి గెజెట్ సప్లిమెంటు పుట 253) శాస్త్రవిషయములు తెలుగున బోధించుటను తర్జుమాలకు అత్యవసరము. 530 పుటలు. రు 2-8-0
దక్షిణాఫ్రికా చరిత్ర. దేశచరిత్ర, వలసకేగిన భారతీయులచరిత్ర. గాంధీమహాత్ముని సత్యాగ్రహచరిత్ర - అనేక చిత్రపటములు. 472పుటలు. క్యాలికో బైండు, విజ్ఞానచంద్రికలోని 36వ కుసుమము. 2-0-0
సహకార వస్తునిలయోద్యమము : రాక్డేలుపయోనీర్లచరిత్ర- భారతదేశోద్ధరణకు సహకార మెట్లుపయోగింపగలదో వర్ర్ణింపబడినది. భారతదేశ ఆర్థికస్థితిగతి లెక్కలు కలవు. గ్రంధాలయములం దుంచుటకు పాఠ్యగ్రంధనిర్ణయ సభవా రామోదించినారు. (చూ. 10-5-38 ఫోర్టు సెంటు జార్జి గెజెట్ సప్లిమంటు పుట 178) 260 పుటలు. క్యాలికో బైండు రు 1-4-0. సాదా రు 1-0.0
అధినివేశ స్వరాజ్యము. కెనడా, ఆస్ట్రేలియా, ఐరిష్ - ఫ్రీస్టేటు మున్నగు అధినివేశముల, రాజ్యాంగ పరిణామము, ఆంగ్లరాజ్యాంగము, స్వరాజ్యసమస్యలు జర్చించు గ్రంథము హిందూ ఆంధ్ర పత్రికల ప్రస్తుతులందినది. 250 పుటలు. రు 0-12-0