Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఖూనీబాగ్

381


డెను. ప్రభుత్వమువారు విచ్చలవిడిగా నిర్బంధవిధానమును ప్రయోగించి అనేకులపైన కుట్రకేసులుపెట్టి ఉరిదీసి చెఱకంపి అనేక విధములుగా వారిని హింసించినను పూర్తిరహస్యము బయల్పడలేదు. దేశములోనిది వ్రేళ్లుపారి, పాదుకొనినదని ప్రభుత్వమువారు గ్రహించిరి. ఢిల్లీదర్బారు సమయముననే రాజప్రతినిధియగు హార్డింజిపైన బాంబుప్రయోగము జరిగెను.

దేశములో తీవ్రదౌర్జన్యము పురికొల్పు రాజద్రోహకరములైన కరపత్రములు, పత్రికలు, ప్రచారము, జరుగుచునే యుండెను. ఈ యుద్యమమున తమప్రాణము లర్పించి దేశమున కేదో సేవజేసి ధన్యులమగుదుమని స్వరాజ్యము స్థాపింపగలమని ఈ యువకులయూహ. ఇండియా డిఫెన్సుచట్టముక్రిందను 1918 సంవత్సరపు శాసనముక్రిందను నిర్బంధింపబడినవారు నాటికి 800 మంది యుండిరి. ఇట్లు పెరుగుచున్న ఈ రాజద్రోహ ఉద్యమము యొక్క శాఖోపశాఖలెల్ల పరిశీలించి దీనిని సమూలముగా పెరికివేయు మార్గములను సూచింపవలసినదని కోరి ఆంగ్లన్యాయాధిపతియగు "రౌలటు"గారి అధ్యక్షతక్రింద నొక విచారణసంఘమును నియమించిరి. సభ్యులలో మద్రాసు హైకోర్టున్యాయాధిపతియగు కుమారస్వామిశాస్త్రిగారు నొకరు. ఈకమిటీ నివేదిక 1918లో ప్రకటింపబడెను. వీరు దేశములోని స్వాతంత్ర్యోద్యమము స్వదేశీయుద్యమము స్వరాజ్యోద్యమము మొదలగుతీవ్ర రాజకీయాందోళనములకును ఈవిప్లవోద్యమమునకును సంబంధమును గల్పించిరి. లోకమాన్యుడు అరవిందఘోషు మున్నగునాయకు లెల్లరు ఈ రాజద్రోహకరోద్యమ