పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

380

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


మనిరి. అప్పటికింకను గాంధిమహాత్మునికి బ్రిటీషున్యాయమునందును ధర్మమునందును విశ్వాసము పోలేదు. గాంధీమహాత్ముడు ఐరోపాసంగ్రామమునకు సైనికులనుగూడ ప్రొవుచేసి బిటీషు ప్రభుత్వముపట్ల తనకుగల భక్తి విశ్వాసముల ప్రకటించి యుండెను. తాను దక్షిణాఫ్రికాలో చేసిన సత్యాగహసందర్భమున, భారతదేశ రాజప్రతినిధియగు హార్డింజి ప్రభువును, ఇంగ్లీషు రాజనీతిజ్ఞులును, చాలాసానుభూతి చూపియుండినందున వారెల్లరు సద్ధర్ములే యనియు భారతీయుల కెన్నిటికైన నిజమైన స్వపరిపాలనము నొసగుదురనియు ఆయన విశ్వాసము. అందువలననే మాంటేగ్యూ సంస్కరణ రాజ్యాంగ మెంత ఆశాభంగకరముగా నున్నను దానిని స్వీకరింపవలెనని ఆనా డట్లాయన ప్రబోధము చేసెను.

నాలుగవ ప్రకరణము

ఖూనీబాగ్

I

రౌలటు బిల్లులు

ప్రభుత్వమువా రెన్ని విధములుగా ప్రయత్నించి ఎన్ని క్రూర నిర్బంధ శాసనములు చేసినను దేశములో బయలుదేరిన అరాజక విప్లవోద్యమ మనబడు దారుణవాదము రూపుమాయలేదు. దేశములో నలుమూలలను రహస్య విప్లవ సంఘములు పాతుకొని పనిచేయుచునే యుండెను. బాంబు ప్రయోగములు, హత్యలు, బందిపోటులు సాగుచునే యుం