376
బ్రిటిష్ రాజ్యతంత్రయుగము
స్వరాజ్యప్రయత్నముచేయుటయే భారత దేశీయులకును సరియైన మార్గమనియు తెలిసివచ్చినది. ఐర్లాండులోని స్వతంత్రవాదులగు సీ౯ఫీ౯ పక్షమువారు. దేశస్వాతంత్ర్యముకొరకు చేయుచుండిన కృషియు లేవదీసిన విప్లవమును భారతీయులకొక గుణపాఠముగా నుండెను.
ఇట్టిస్థితిలో భారతదేశములోని దివ్యజ్ఞానసమాజాధ్యక్షురాలును భారతనాగరకతయందు అత్యంత ప్రేమగలిగిన విదుషీమణియునగు ఆనీబిసెంటుగారు ప్రజాభిప్రాయమును గ్రహించి భారతదేశమునకు స్వపరిపాలనమును సంపాదించుటకు సేవచేయదలచి ఆ ఉద్దేశముతో 'హోంరూలులీగు' అనబడు సంస్థను, దేశములో దానికి శాఖోపశాఖలుగా హోంరూలు సమితులను “న్యూయిండియా" పత్రికను స్థాపించి తీవ్రమైన రాజకీయాందోళనమును శాస్త్రీయపద్ధతులపైన నడుపసాగెను. అందువలన దేశములో గొప్ప రాజకీయప్రబోధము కలిగెను. బర్మాలో మండలేనుండి 1914 జూనునెలలో విడుదలయై వచ్చిన లోకమాన్యు డామెకు సాయమొనర్చెను.
ఆ సమయమున జరుగుచున్న ఐరోపామహాసంగ్రామ సందర్భమున దేశమున శాంతిభధ్రతలను స్థాపించుట కని బ్రిటిషు సామ్రాజ్యమువారు "డిఫెన్సు ఆఫ్ ఇండియా” చట్టమును శాసించి దానిక్రింద దేశములోని రాజకీయ నాయకులను చెరలోనుంచి తీవ్రనిర్బంధ విధానమును ప్రయోగించిరి. పత్రికాశాసనమును ప్రయోగించి పత్రికల ధరావతులను రద్దుచేసియు ముద్రణాలయములను స్వాధీనపరచుకొనియు