పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

హోంరూలు - స్వరాజ్యోద్యమము

375


73 తీర్మానములలోని సూచనలనుబట్టి ప్రభుత్వము కొన్ని చర్యలు గైకొనుటయు తటస్థించినది. రాష్ట్రములందుకూడ ఇట్లే శాసనసభలవలన స్వపరిపాలనలోని రుచి, ప్రజాప్రతినిధులకును రాజకీయ నాయకులకును తెలిసినది. ఈ రాజ్యంగము వలన ప్రజలందు స్వపరిపాలనాభిలాషయు స్వరాజ్యకాంక్షయు నధికమైనవి.

బ్రిటీషు సామ్రాజ్య పరిస్థితులుగూడ భారతీయుల స్వరాజ్యకాంక్షకు దోహద మొసగెను. దక్షిణాఫ్రికాలో బ్రిటీషు బోయరు యుద్ధము తరువాత జరిగిన రాజ్యాంగ సంస్కరణముల వలన నా దేశములోని తెల్లవారికి బాధ్యతాయుత స్వపరిపాలనము కలుగజేయబడి అది భారతీయులదృష్టి. నాకర్షించెను. ఇంతేకాదు; తమదేశము బ్రిటీషువారి బానిసరాజ్యముగా నుండుటవలన తమజన్మభూమియగు భారతదేశములోనే తాము దరిద్రులుగా నుండుటయేగాక బ్రిటీషు సామ్రాజ్యములో చేరిన తక్కిన రాజ్యములందును దక్షిణాఫ్రికాలోను గూడా భారతీయులు దరిద్రులై హక్కులు లేక కష్టపడుటయు, దక్షిణాఫ్రికాలో అనేకఅన్యాయములు జరుగుచుండుటయు, వానిని మాన్పుట కెవ్వరు నేమియు చేయలేక పోవుటయు, చూడగా స్వపరిపాలనములేనిది భారతీయుల కష్టములు గట్టెక్కవని గ్రహించిరి.

దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కులకొరకు గాంధీమహాత్ముడు స్వయంసాహాయ్యపద్దతితో పోరాడి సాత్విక నిరోధము చేయగా 'గాంధీస్మట్సు' రాజీనామా జరిగి భారతీయులకు కొన్ని హక్కులు కలిగెను. ఇట్లు స్వయంసహాయ పద్ధతులతో