వందేమాతరం
357
నేరము నారోపించి లోకమాన్యుని పట్టుకొని 1 1/2 సంవత్సరములు కఠినశిక్ష విధించిరి. 1818 సంవత్సరపు రిగ్యులేషనుక్రింద మహారాష్ట్ర సర్దారులగు 'నాతూ' సోదరులను ప్రవాసమంపిరి. తిలకుగారి పాండిత్యమువలన మాక్సుమూలరుగా రాయనకు స్నేహితులై తిలకుగారి పక్షమున పనిచేయగా ఒక సంవత్సరము తరువాత తిలకుగారిశిక్ష రద్దు చేయబడెను.
II
ఆరోజులలో భారతదేశ రాజకీయరంగమునందు గోఖలేగారిపేరు మారుమ్రోగుచుండెను. భారతదేశములో సుప్రసిద్ధహైకోర్టు జడ్జీయై గొప్పదేశభక్తుడై మహారాష్ట్ర చరిత్రను రచియించి దేశోద్ధరణకు తోడ్పడు అన్ని కార్యములందును తానుగూడ పాటుపడుచుండిన శ్రీ మహాదేవ గోవింద రానెడే గారికి గోఖలేగారుశిష్యులై 1887లో ఆంగ్లమహారాష్ట్రభాషలందు పత్రికలను నిర్వహింపసాగిరి. భారతదేశ ఆర్థికస్థితిగతులందు ప్రభుత్వాదాయ వ్యయపద్ధతులందు గోఖలేగారు తనగురువగు రానెడేగారి వలెనే గొప్ప ప్రజ్ఞావంతుడయ్యెను. ఆనాడు బ్రిటిషు పరిపాలనావిధానములను సమర్ధింప జూచువారికి వీరిరువురు ప్రక్కలో బల్లెములవలె నుండిరి. గోఖలేగారు ఆ కాలముననే నాలుగు సంవత్సరములు బొంబాయిరాష్ట్రీయ మహాసభకు కార్యదర్శియై తరువాత 1895 లో కాంగ్రెసు మహాసభకును కార్యదర్శియైరి. భారతదేశ రాజకీయములకు పితామహుడని ప్రఖ్యాతివడసిన దాదాభాయి నౌరోజీగారు భారతదేశోద్ధరణకు చేయుచున్న కార్యములందెల్ల గోఖలేగారు వారికి కుడిభుజముగ