Jump to content

పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతదేశ స్వాతంత్ర్య విప్లవము

321


నవీన ఆంగ్లేయ ధర్మములనుబట్టి యీ పద్దతి యాపరగణాపరిపాలకుడగు తొమేసన్‌కు రుచింపలేదు. ఈ గ్రామాధికారుల హక్కుల నితడు తీసివేసెను. అంతట నారాష్ట్రములో జవా౯పూరు, అజాంగర్, ఆగ్రా, కాన్పూరు, జిల్లాలలో తీవ్రమైన సంచలనము కలిగెను. ఈ చిల్లరగ్రామాధిపతులెల్లరు తరువాత పెద్ద కుట్రదారులతో కలసిరి. ఆగ్రాకు దగ్గఱనే ఝాన్సీ రాజ్యముండెను, ఈ రాజ్యమునకుగూడా నానాసాహేబుకు తటస్థించిన గతియే పట్టినది. వితంతువగు ఝాన్సీరాణి చాలా సద్గుణవంతురాలు. ఆమె నెరిగినంతవరకు దేశప్రజలెల్లరు ఆమెను గౌరవించుచుండిరని అచ్చటి పొలిటికల్ యేజంటుగారే వ్రాసియుండిరి. హిందూధర్మశాస్త్రప్రకార మీమెకు దత్తతాధికారము గలదు. 1854లో నామె భర్త చనిపోగా నామె దత్తతచేసికొనదలచినది. డల్‌హౌసీయందుల కంగీగరింపక యీ రాజ్యమునకు వారసులు లేనందున కలుపుకోవచ్చునని యట్లు చేసెను. ఝాన్సీరాణి ఎన్నివిధములుగా మొరపెట్టుకొన్నను లాభము లేక పోయెను. అందువలన నెంతో సద్దర్మురాలగు నీయమ తరువాత నాంగ్లేయులపాలిటి మృత్యుదేవత యయ్యెను. విప్లవప్రారంభమునకు పూర్వము ఈమెగూడ నానాసాహెబుతో రహస్యాలోచనలు జేసెననుట కాధారములు కలవు.

ఇట్లేనానాసాహెబును అయోధ్యనవాబుల వంశీయురాలగు బీగంసాహెబాయను మహమ్మదీయస్త్రీయు, నేటి సంయుక్త రాష్ట్రప్రజలును, ఝాన్సీరాణియు ఆంగ్లేయపరిపాలనపై విరో