పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

322

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


ధించి ఏకోద్దేశముతో నొక విప్లవ కమిటీగా నేర్పడి దేశమునందు విప్లవాగ్నికి దోహదము చేయసాగిరి. వీరి యుద్దేశముల కానాటి పరిస్థితులు చాల అనుకూలముగా నుండెను. 1857 నాటి స్వాతంత్ర్య విప్లవము వచ్చుటకుగల నిజమైన కారణములను చరిత్రకారులు క్రమక్రమముగా బయల్పరచి యున్నారు. ఈ క్రిందివి ముఖ్యకారణములుగా పేర్కొనబడినవి.[1]

(1) అన్యాయపు భూస్వామ్య పద్ధతులు, రైతులుభరింపలేని అత్యధికమగు పన్నులభారము; పన్నులువసూలుచేయుట కవలంబింపబడిన క్రూరవిధానములు'; అన్యాయపు రివిన్యూ పరిపాలన. (2) భారతదేశపరిపాలనలో భారతీయులకు కొంచమైన ప్రవేశ మివ్వకపోవుట. (3) న్యాయవిచారణ చక్కగా జరుగకపోవుట. అది అత్యధిక వ్యయకారణమై అన్యాయములు హెచ్చుట. పోలీసుల లంచగొండితనము ప్రజాపీడనము. (4) ఆంగ్లపరిపాలకులకు దేశభాషలు తెలియకపోవుట; దేశవాసులన్న అసహ్యము కనబరచుచుండుట. (5) ఇంగ్లీషు విద్యావిధానము; మతబోధకుల తంత్రములు. (6) ముద్రణ స్వాతంత్ర్యమువలన రాజకీయ అభిప్రాయములు వర్ధిల్లుట, (7) కులములు వర్ణాశ్రమధర్మములు ప్రజలందు ఆవేశమును కలిగించుట. (8) చలామణి పద్దతిలోని లోపములు; అందువలన ప్రజలకు కలిగిన నష్టము. (9) నల్ల మందు యిజారాప్రభుత్వము వహించుట చాలమందికి కడుపుమంటగానుండుట. (10) పబ్లికువర్క్సు - కాలువలు, చెరువులు, నూతులు అభివృద్ధి చేయక పోవుటవలన

  1. చూడు ఆండర్సన్ సుబేదార్ గార్ల గ్రంథము