పుట:బ్రిటిష్ రాజ్యతంత్రయుగము అను బ్రిటిష్ ఇండియా చరిత్ర దిగవల్లి వేంకటశివరావు.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

200

బ్రిటిష్ రాజ్యతంత్రయుగము


కూడా ప్రాకినవి. గాని అతనిని వెనుకకు రప్పించుటతప్ప అధికారులు చేసిన ఘనకార్యములేదు. (6-12-1804) తేదీన కార౯వాలిను రాన్ సేనానికి వ్రాసినలేఖవలన నిది బయల్పడినది.

III

హేస్టింగ్సు కేవలము వెనుకముందు లాలోచింపని ఆశాపరుడు. అతనికాలమున 1813 నాటి కంపెనీ రాజ్యాధికార సన్నదుచట్టము ప్రకారము భారతదేశమువలన నింగ్లాండు అమితలాభము పొందదలచినది. ఇతడు కుటిల రాజ్యతంత్రము ప్రయోగించి కుట్రలుచేసి అక్రమయుద్దములు జరిపి ఈయుద్దేశమును సఫలముచేసినాడు. తానుగూడ లాభముపొందినాడు. నేపాళరాజుతో యుద్ధమును, పిండారీల యుద్దమనబడు మహారాష్ట్రయుద్ధమును, రాజపుత్రులతో కుట్రయు, సింధియాతో సంధియు కేవలము రాజ్యాక్రమణకొఱకును, ధనార్జనకొఱకును జేసినవే. పీష్వా బాలాజీరావు బరోడారాజును చెరపెట్టి కొన్ని లాభకరములగు ఏర్పాటులుచేసికొనగా హేస్టింగ్సు పీష్వాకును బరోడాకునుగల ద్రవ్యవ్యవహారములలో తాను కొంతలాభము పొందదలచి గంగాధరశాస్త్రియను బాహ్మణుని బరోడాప్రతినిధిగా నియమించి కుట్రలుచేసి అతనిద్వారా చాలలాభమును పొందెను. హేస్టింగ్సు నాగపురరాజగు అప్పాసాహెబును తన రాజ్యతంత్రముచేత బిగియించి ఒక రాత్రిపూట సంధిపత్రముపైన సంతకముచేయించెను. ఇది నాగపుర ప్రజల కిష్టములేదు. (Prinse-Political and Military Transactions in India)