పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భౌగోళిక సాన్నిహిత్యం వలన సోదర ద్రావిడ భాషలైన తమిళ, మలయాళ, కన్నడాల నుండి కూడా పలు సామెతలు తెలుగులోకి వచ్చాయి. నమాన రూపం ఉన్న సామెతలు నాలుగు భాషలలో ఉన్నపుడు ఏది దేనికి మూలమో చెప్పడం కష్టం. ఇలాంటి నాలుగు వందల ఇరవై సామెతలను "సాటి సామెతలూ పేరిట నిడదవోలు వేంకటరావు, మరియప్ప భట్. ఆర్పీ నేతుపిళ్లై, ఎన్‌.కె.నాయర్‌లు నంకలనం చేయగా మద్రాసులోని విజయా పబ్లికేషన్స్‌వారు 1960 లో ప్రచురించారు. ఈ గ్రంథం నుండి ఒక ఉదాహరణం:

తెలుగు - 'ఆశకు అంతం లేదు' తమిళం- 'ఆనైక్కువోర్‌ అళ్ విల్లై కన్నడం- 'ఆశెగె మేరె యిల్లా' మలయాళం - 'ఆశెక్కు అతిరు యిల్ల'. మొత్తం మీద సామెతలు ఎప్పుడు, ఎలా పుట్టాయో తేల్చి చెప్పడం సాధ్యం కాదు. బాబిలోనియా, ఈజిప్టు ఇండియా దేశాల అత్యంత ప్రాచీన గ్రంథాల్లో, వేదాల్లో, ఉపనిషత్తులలో, బైబులులో, ఖురానులో, పురాణాలలో సామెతలు కనిపించడాన్ని బట్టి సామెతల ప్రాచీనతను ఊహించవచ్చు.

ఉ. తెలుగు సామెతలు - స్వరూపం
సామెతల స్వభావాన్ని చర్చించిన తర్వాత ఇప్పుడు సామెతల స్వరూపం ఎలా వుంటుందో పరిశీలిద్దాం. స్వరూపాన్ని బట్టి తెలుగు సామెతలను పి. నరసింహారెడ్డిగారు క్రింద చూపిన విధంగా విభజించారు.24

1. తెలుగు సామెతలు కొన్ని క్రియా రహిత వాక్యాలుగా కనిపిస్తాయి. ఉదా: 'మేపే రూపు' (ఏకదళం), 'అంకెకురాని ఆలు, కీలెడలినకాలు' (ద్విదళం).

2. కొన్ని తెలుగు సామెతలు క్రియా సహిత వాక్యాలుగా ఉంటాయి. వీటిలో ఏక వాక్య సామెతల నుండి పంచవాక్య సామెతలదాకా కనిపిస్తాయి. ఉదా: 'ఆకలి రుచి ఎరుగదు' 'గువ్వగూడెక్కె, రాజుమేడెక్కె' 'అంతనాడు లేదు ఇంతనాడు లేదు సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు.'

3. తెలుగు సామెతలు మరికొన్ని సంయుక్త వాక్యాలుగా ఉంటాయి. ఇటువంటి కొన్ని సామెతలలో రెండు సామాన్య వాక్యాలూ క్రియంతాలుగా ఉండవచ్చు. ఉదా: 'అంగట్లో అన్నీ ఉన్నవి - అల్లునినోట్లో శని ఉన్నది'. మరికొన్ని సామెతలలో రెండు సామాన్య వాక్యాలలో ఉండే రెండు క్రియలకు బదులు రెండవ వాక్యం మాత్రం


24 పి.నరసింహారెడ్డి, తెలుగు సామెతలు - జనజీవనం, శ్రీనివాన మురళీ పబ్లికేషన్స్‌, తిరుపతి, 1983,పు. 20-24

27