పుట:బైబులు సామెతలు ఒకటవ భాగం.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
4. వివిధ సన్నివేశాలు
జీవితంలోని అనేక సన్నివేశాలనుండి కూడా సామెతలు పుట్టుకువచ్చాయి. ఉదాహరణకు అల్పులు గొప్పవారిని అకారణంగా, వృధా ప్రయానగా ఆడిపోనుకొనే సన్నివేశం నుండి 'కుక్క మొరిగితే జంగం పరువు పోతుందా?' అనే సామెత పుట్టుకు వసై లేనిగొప్పను చూపించే వారిని ఉద్దేశించి 'మింగ మెతుకు లేదు, మీసాలకు సంపంగె నూనె', 'ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత' లాంటి సామెతలు పుట్టుకు వచ్చాయి. బావా మరదళ్ల సరంస నుండి 'బావా! నీభార్య ముండమోనిందంటే, మొఱ్ఱో అని ఏడ్చాడట' 'బావా! బావా! నీ భార్య అత్తపాలు తాగావా? అంటే, అబ్బే! నేనెందుకు తాగాను? అన్నాడట', 'బావా! అని చూడబోతే, రావా? అని కొంగు పటువకున్నాడట' లాంటి సామెతలు పుట్టుకు వన్తే అత్తాకోడళ్ల విరనం నుండి 'అత్తమీద కోపం దుత్తమీద చూపినట్లు' 'అత్తమెత్తన కత్తిమెత్తన ఉండవు' 'అత్తకు నాకు ఆరంబేరం, అత్తనెత్తుకుపో ముత్యాలమ్మా! అత్తనెత్తుకుపోతే ఆరుగాళ్లజీవాన్ని అర్పిస్తాను' 'కోడలు ముండమొయ్యాలి కొడుకు బాగుండాలి' లాంటి సామెతలు పుటువకు వచ్చినట్లు తెలున్తుంది.
5. పరభాషా సామెతలు
భాషకు ఆదాన ప్రదానాలు నహాజం. ఆదాన భాష అంటే అన్యదేశాలను గ్రహించేది. ప్రదాన భాష అంటే ఇతర భాషలకు ఇచ్చేది. ఏ భాష అయినా ఇతర భాతా ప్రభావాలకు కాస్తోకూస్తో లోనవుతుంది. భాషల్లో ఆదాన ప్రదానాలు సాధారణంగా భౌగోళిక సాన్నిహిత్యం, రాజకీయ, వాణిజ్య, సాంన్కృతిక కారణాల వలన నంభ'విన్తుంటాయి.

తెలుగు సాహిత్యం మీద నంన్కృత సాహిత్య ప్రభావం కారణంగా 'అతి వినయం ధూర్త లక్షణం', 'యథారాజా తథాప్రజా' లాంటి సామెతలు ఉన్నవి ఉన్నట్లు రాగా 'చెట్టువలేని చోట ఆముదపు చెట్టు మహావృక్షం' లాంటి సామెతలు అనువాదాలుగా తెలుగులోకి వచ్చాయి. రాజకీయంగా మనం ఆంగ్లేయుల పాలనలో ఉన్నపుడు ఆంగ్లభాషాప్రభావం కారణంగా 'తానొకటి తలచిన దైవమొకటి తలచును' - ' MAN proposes GOD Disposes'కుక్క కాటుకు చెప్పుదెబ్బ' - 'Tit for tat', 'తెలియని దేవత కన్నా తెలినిన దయ్యం మిన్న' Aknown devil is better than an unknown angel- లాంటి సామెతలు తెలుగులో పుట్టుకు వచ్చినట్లు గ్రహించవచ్చు.

26