పుట:బారిష్టర్ పార్వతీశం.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొక్కపాటి నరసింహశాస్త్రి

197

ఆవిడ కళ్ళూ బుగ్గలూ భగ్గున మండడం ప్రారంభించాయి. “ఓ సేం నన్ను చంపేసేవ్” అని గొల్లుమంది. “ఫరవాలేదు, ఫరవాలేదు.

క్షమించండి” అని ఒక్క పరుగున వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడి తువ్వాలుతో ఆవిడ కళ్ళూ బుగ్గలూ, వత్తి, బుగ్గలకు కొంచెం నేనుపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ నవ్వుతే తల్లికి కోపం వస్తుందని ఏడవాలన్నా ఏడవలేక, నవ్వలేక నా కేసి గుడ్లప్పజెప్పి ఆపిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. సుమారు ఒక పావుగంట సేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడ ఉద్రేకం, కళ్ళూ, ముఖంతో పాటు చల్లబడి నన్ను చూచి "ఓ సేం, సేం యూ ఆర్ ఏ బేడ్ బాయ్ యూ రియల్లీ కిల్డ్ మీ. నువ్వు చాలా చెడ్డవాడవు నన్ను