పుట:బహుముఖ ప్రజ్ఞాశాలి మహాకవి దాసు శ్రీరాములు.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెక్కుగలవు. పలుచోట్ల ప్రౌఢరచనగలదు ... ఈ కవియొక్క భాషాజ్ఞానము మిక్కిలి దొడ్డది. వీరి లోకానుభవము దానికంటె దొడ్డది, పూర్వకథాభిమానము మరియు మిక్కిలిగానున్నది. ఈ గ్రంథము చదివినచో ఎట్టివారైనను కవులు తాక తప్పదు”.

కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ

"ఏతావాతా శ్రీదాసు శ్రీరామకవిగారు బహుముఖ ప్రజ్ఞాదురంధరుడు అయిన మహాకవి యనుట నిస్సంశయము. A versatlie genius. ఆయన ఒక మహా సముద్రము. అందనేక రత్నములు కలవు. పరిశీలింపఁజాలు పరీక్షకులకే వారి యౌన్నత్య మెరుకబడును - ఆ చంద్రతారకం బాంధ్రి యున్నన్నాళ్లు - దాసు శ్రీరాముండు ధరణి వెలుగు (నిలుచు)".

- శ్రీ విశ్వనాథ వేంకటేశ్వర్లు

"ఆద్యతన ఆంధ్రవాఙ్మయ నిర్మాత దాసు శ్రీరామకవి. వారింటి పేరు దాసువారు గాని, వారి కవితా పాండిత్య కావ్యరచనా విశిష్టత చేతవారు కవులకు స్వామిత్వము వహించారు."

- కళాప్రపూర్ణ శ్రీ నిడదవోలు వేంకటరావు

"శ్రీరాములు పంతులు గారు ప్రతిభా వుత్పత్యభ్యాసములకు కావ్యహేతువులు మూడును పుష్కలముగా గల మహాకవి పుంగవులు. దేవీభాగవతము వారి సర్వకవితా కౌశలమునకు పట్టుకొమ్మయైన ప్రశస్త రచన.”

ఆచార్య దివాకర్ల వేంకటావధాని

"అభినవభాసుడు”

- ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం

"శ్రీ దాసు శ్రీరామపండితుడు మహాకవిమాత్రమే కాదు, సకలశుభలక్షణ సమంచితుడైన అదృష్ట జాతకుడు. జ్ఞాన సంపదకు మించిన అయిశ్వర్యము అయిశ్వర్యమునకు మించిన ఔదార్యము - ఔదార్యమునకు మించిన ఆత్మధైర్యము, పండితులను పోషించియాదరించిన సరస్వతీపీఠాధ్యక్షుడు. చందోబద్ధ కవిత్వలోలుడగు నీకవిజనాగ్రణి, హావభావ విన్యాస లయ తాళస్వరంగా సంశోభిత సంగీతనాట్యాభి నయకళాప్రవీణుడు. లౌక్యసరణి, ఘననిపుణమణియని వినుతిగన్న దొడ్డన్యాయవాది. 'రామ నీసమానమెవరు?' అను సంకీర్తనకు పాత్రుడైన ధన్యజీవి ఈకవియనుట వాస్తవమేగాని స్తవము కాదు. "

- దాసు వామనరావు, ప్రముఖ పాత్రికేయులు

7