పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

54

బసవపురాణము

క్రీ. 1182 లో బిజ్జలుని కొడుకులను వీడి పశ్చిమ చాళుక్యరాజ్యలక్ష్మి మరలఁ జాళుక్యరాజేయగు నాల్గవ సోమేశ్వరునిఁ జెందినది. కలచుర్య వంశ్యుల పరిపాలన మంతతో నంతరించినది - శాసనములవలన బిజ్జలవృత్తాంత మింతమాత్రమే తెలియవచ్చుచున్నది.

బసవనకృతులు

కర్ణాటకభాషలో బసవన్న "లాలితంబుగ నాల్గులక్షల మీఁద, నోలినర్వది నాల్గువేలగీతము” ల రచియించినట్లు బసవపురాణము చెప్పుచున్నది. పయిసంఖ్య యా గీతముల గ్రంథసంఖ్య కావచ్చును. పండితారాధ్యచరిత్రమున బసవనిగీత మొకటి మొదలెత్తి యుదాహృతమయినది.

అక్కజంబక్కజంబని బాసగీత
మొక్కటానతియిచ్చె .........”

బసవన్న గీతములు కొన్ని నేఁడును గర్ణాటభాషలోఁ గానవచ్చు చున్నవి. షట్ స్థలవచనములు, కాలజ్ఞానవచనములు, మంత్రగోప్యము, శిఖారత్నవచనములు అను పేరుగలవి యిప్పుడు దొరకుచున్నవి. [1]వీనిలో కూడలి సంగమదేవుని సంబోధనముండును. బసవనకాయన యిష్టదైవము గదా! బసవేశ్వరుని కర్ణాట గేయములను మచ్చునకుఁజూపుచున్నాఁడను.

“నరెకెన్నెగె తెరెగల్లకె శరీరగూడవగదమున్న
 హల్లుహోగి బెన్నుబాగి అన్యరిగె హంగాగదమున్న
 కాలమేలె కయ్యనూరి కోల హిడియదమున్న
 ముప్పిందొప్పవళియదమున్న మృత్యుముట్టదమున్న
 పూజిసు నమ్మ కుడలసంగమదేవరా!

అరగిన పుత్తళియ నురియ నాలగె హొయ్దుమాతాడువ సరసబేడ.

  1. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలోఁజూడనగును. అవి యింకను ముద్రితములు కాలేదు. ఇందు దాహృతములయిన గేయములు కర్ణాటకకవిచరిత్రలో వుదాహృతములైనవి.