పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

బసవపురాణము


సోమనాథుని దర్శించి యపచారము క్షమింపఁ బ్రార్థించెను. సోమనాథుఁ డనుగ్రహించెను. రెండవకన్నును వచ్చెను. రంగనాథుఁడు శైవదీక్ష నొసంగుమని సోమనాథునిఁబ్రార్థించెను. పుత్రుఁడగు చతుర్ముఖ బసవేశ్వరునిచేత సోమనాథుఁ డాతని శివదీక్షితుని జేయించెను. రంగనాథుఁ డప్పుడు వీరభద్ర విజయ శరభచరిత్రాదులను రచియించి గురుపాదముల కర్పించెను. తరువాత సోమనాథుఁడు కర్ణాటదేశమునఁ గలికె మనునగ్రహారమునకుఁ బోయి సమాధిస్థుఁడై లింగైక్యమందెను.

ఇందుఁ బ్రధానముగా, నపూర్వముగాఁ గానవచ్చుచున్నది చక్రపాణి రంగనాథుని విషయము.

ఈ పాల్కురికి సోమనాథపురాణమే కాక కర్ణాటకృతి యగు గురురాజచరిత్రముగూడ నీ చక్రపాణి రంగనాథునిచరిత్రమును జెప్పుచున్నది. ఈ తొంటిదార్యకవి చెప్పినట్టే యాగురురాజచరిత్రకర్త సిద్ధనంజేశకవియు రంగనాథుని యోటమిని జెప్పినాఁడు. 'వీరభద్రవిజయము' 'శరభలీల' యను గ్రంథములనే కాక యాతఁడు శ్రీగిరినాథవిక్రమమని యేనూఱు సీసపద్యముల తెలుఁగు గ్రంథమును గూడ రచించెనట! దానినే సంస్కృతమునఁగూడ రచించెనట ! ఆ కవి యిట్లు చెప్పుచున్నాఁడు :

శ్రీశైలభర్తకును సీసంబులేనూఱు
లేసప్పపద్యంగ ళెంటుసావిరగళుం
భాసురద దండకం సాహస్ర తారావళియు నాల్కు లయగ్రాహియు
ఆ శతకవృత్తగళు దోధకం సావిరవు
భాసురదతోటకం నూఱు రగళెగ ళేడు
భాషిసిద మత్తకోకిల మూఱు సాసిరం గీతియం తాఱునూఱు.
సరసమంజెర వెంటు కందంగ ళైనూఱు
విరచిసిదకృతియు మూవత్తాఱు గద్యగళు
నిరువ మూవత్తాఱు వుభయశతకం వొప్పు మిగిలు సర్వేశ నిమిగె.