పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/378

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షష్ఠాశ్వాసము

171

ఇంకఁజెప్పులతోన [1]యిట్లుంటివేని - శంకింప కిప్పుడ సందుసందులకు
నఱకుదు” ననవుడుఁబిఱుసన కతఁడు - "నఱిముఱి నింతేల యాగ్రహించెదవు?
ముక్కంటిగుళ్లకు దిక్కు గల్గితివి - నిక్కపు భక్తుండ! నీకేల వెఱతు
గుడి వసదియ వేల్పు [2]లొడయండు జినుఁడు - నుడువకుకాదేనిఁబడయుమా[3]మగిడి
దల దర్గియిప్పుడ మలహరుచేత; - నిలనీవె భక్తుండ వితఁడె వే”ల్పనిన
“నితనిఁజంపుట [4]యిది యెంత దలంపఁ - [5]బ్రతినఁజూపమి భక్తిపంతంబు గాదు
శిరమిత్తుఁబడయుదు జినసమయంబు - శిరము ద్రుంపుదు బాసఁజెల్లింతు” ననుచు
శ్రీకంఠుభక్తికిఁజేవ యెక్కంగ - నేకాంతరామయ్య యిట్లని పలికె
“శిర మిచ్చి పడయుట యరిది యంటేని - బరవాది! [6]వినుర మా భక్తులమహిమ
యొక్క భక్తుండు జం[7]బూర్మహాకాళుఁ - డక్కజంబుగ శిర మభవున కిచ్చి
యిలయెల్ల నెఱుఁగంగ నెలమితోఁబడసెఁ - దల నట్టతోఁ గీలుకొలిపి ప్రాణంబు
అట వార్తగలిగి యీకటకంబునందుఁ - బటుమతి గోవిందభట్టారకుండు
శివుని నిర్మాల్య మిచ్చిన మస్తకంబు - [8]తవిలిచి కొను టిది దప్పు దప్పనుచుఁ
గఱకంఠునకుఁదల [9]దఱగి పూజించి - నెఱయ మూన్నాళ్లకు మఱియొండుశిరము
వడసె వెండియు నొక్కభక్తుఁడిట్టిదియుఁ - గడు నపహాస్యంబుగాఁబ్రతిష్ఠించి
మూఁడుదినంబులు ముక్కంటి యచట - లేఁడొ తాఁజచ్చినవాఁడొ కా కనుచు
మొఱటద వంకయ్య యఱిముఱి శిరము - తఱుగంగ మొలవఁగఁ దఱుగఁగ మొలవఁ
దఱిగెడు తలలును బూన్పని శిరముఁ - [10]బూన్చినపిమ్మటఁబుచ్చెడు శిరము
బూన్చెడి శిరమును మొలచిన శిరము - మొలవఁగ లోలోన నలిఁదోఁచు శిరము
మొలచెడు శిరమును మొలచిన శిరము - మొలవఁగ లోలోన నలిఁదోఁచు శిరము
తఱిగెడు శిరమును దఱుగని శిరము - తఱుగక తనుదాన యొఱఁగెడు శిరము
సరసర హరుమీఁద సంధిల్లుశిరముఁ - బొరి నొయ్యనొయ్యన పొడవగు శిరము
కన్నులార్చుశిరముఁగాదనుశిరము - మిన్నక శివుమ్రోల మెలఁగెడి శిరము
నున్నతి మీఁదన యుండెడుశిరము - సన్నసేయు శిరము జరిగెడు శిరము
నారుచుశిరము నౌనౌ ననుశిరముఁ - గేరెడుశిరమును దారెడుశిరముఁ
బారుతెంచుశిరంబుఁబైపడుశిరము - గారవంబున శివుఁగలసెడి శిరము

  1. ఇట్లుండితేని
  2. టొ, నొ
  3. మగుడి
  4. యెంతయిదిముదలింప
  5. ప్రతిఁజూపకుండుట (కునికిదా)
  6. వినర
  7. బురి
  8. తవిలించినిలుచుట
  9. దఱిగి
  10. బూన్పంగ నొయ్యనఁ బొందగు శిరము