పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/366

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

159

యరుదెంచి డగ్గఱి “యయ్యగారలకు - శరణార్థి శరణార్థి శరణార్థి" యనుడు
“శివమస్తు శివమస్తు శివమ” స్తటంచుఁ - దవిలి తోడ్తోడన తపసి దీవింప
“డిగు డిగు గొరగ! నాకగపడి తింక - నగవు గా దిచట నున్నను సయిరింప
నందివాహన! నీకు నరవాహనంబు - పొందగునే చూచి భువి నరు ల్నగఁగ”
ననుచుఁబాదము వట్టి యల్లార్చి తివియఁ - గనుఁగొని దరహాసకలితాస్యుఁడగుచు
ధరడిగ్గి ముసిఁడి [1]చౌడరసు నందంద - కర మభిలాషమైఁగౌఁగిటఁ జేర్ప
సత్యస్వరూపుఁడు సౌడరాయండు - నత్యద్భుతాక్రాంతులై నరు ల్వొగడఁ
దోడ్తోన తవరాజుఁదోడ్కొని పెండ్లి - కేడ్తెఱ[2] దళుకొత్త నేఁగంగ నవలఁ
బొలమేర వటవృక్షముల సమీపమున నలిరేఁగి గోపాలకులు నటింపుచును
గము[3]లేర్చి యుద్దించి కాల్గన్న వారిఁ - దమలోనఁగేలివాదంబు [4]వుట్టుటయు
“గోకులపతియాన గుఱి [5]యది మీకు - మాకును బసవనిమఱ్ఱియ” యనుడు
న్యగ్రోధముల [6]యర్త నడచుచు సజ్జ - నాగ్రగణ్యుండు సౌడయ్య యాలించి
పసులవాండ్రనుగూడఁ[7]బద రిదియేమి - బసవనిమఱ్ఱి యన్పలుకయ్యె” ననినఁ
బ్రెబ్బొంతపెయ్యలపెద్ద యందొకఁడు - "నిబ్బసవనివార్త యెఱుఁగుదుఁ గొంత
యట తాతచే వింటిన ని తమతాత - చిటిపొటి వాండ్రకుఁ జెప్పె మాకెల్ల
నలుక రెట్టింప రెం డాఁబోతు లిచట - [8]మలయుచు నేడ్దినంబులు వోరఁబోర
నెత్తురు వఱదలై నేలయంతయును - జొత్తిల్ల నొకపోతు సొలసి చచ్చుడును
నచ్చోన [9]పాఁతినఁజెచ్చెర మొలచె - నచ్చుగా నీమఱ్ఱి యట్లుగావునను
బసవనిమఱ్ఱి యన్పలు కయ్యెనండు - రసలార మఱియుఁజోద్యం బట్లుఁగాక
కఱచిన మాంసంబు గతి నుండుఁబండ్లు - విఱిచినరక్తంబువిధి నీరుగాఱు
నేనాఁట మఱ్ఱిపా లెఱ్ఱనైయున్నె - తా నమ్మరే [10]చూడఁదథ్య”మిట్లనుడు
వారించి “యిదివ్రాఁతవా"ర్తని యొద్ది - వారెల్ల [11]నుడుప నవారితవృత్తి
పసరింపఁ"గ్రొత్తేమి ప్రాఁతేమి యింక - బసవనిమృతి సెవిఁబడ్డపిమ్మటను
మురియుచు బసవఁడు ముందఱఁజనక - పరిణయంబునకేఁగఁ బంతమే నాకుఁ
బడయకపోయెడుపలుకులే?” లనుచుఁ - బెడబొబ్బలిడుచు సంప్రీతినార్చుచును
“వెడలుము వెడలుము వృషభేంద్ర!” యనుచు - [12]వడినెయ్దియలుగున వటమూఁది

  1. చౌడయ్య
  2. ముదముననేఁగ నప్పాట
  3. లేరియుద్ధింప
  4. లువుట్టె
  5. యటె
  6. చెంతనరుగుచు
  7. బదురి, బదమి
  8. నలిరేగి యేడుదినమ్ములువోర
  9. ప్రాఁతినఁ
  10. జూడఁదప్పది
  11. నుడువ
  12. నడరంగవటముపై నలుఁగుసాఁచుడును.