పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/347

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

140

బసవపురాణము

పూసల నయనారు కథ

రూఢిగా విక్రమచోడఁడు ధరణిఁ - గూడఁగఁబసిఁడిని గుడి నియోగించి
లింగప్రతిష్ఠ సల్లీలఁజేయంగ - మంగళంబలరార మానసంబునను
దానును రత్నవిమానమయంబు - గా నొక్క గుడిగట్టి కాలకంధరుని
నాసక్తి మెప్పించి యరిగినయట్టి - పూసలనయనారి దాసానుదాసి

మఱికొందఱ కథలు


ధర రాజ్యమొల్లక తిరుముడి దాల్చి - పరము నమ్మిన తిరుపాలుని బంటఁ
దిరునావకపురీశుకరుణఁబ్రాణేశు - నిరవెర్గి కొల్చినతిరు[1]కుర్విబంట
ధర రోహిణియుఁదాను హరుకృపఁజనిన - తిరుపూరి [2]తిరుమూలదేవునిబంట
ననయంబు భక్తసహస్రార్చలందుఁ - జెనసి ముక్తికిఁజను [3]చిఱుపులిబంటఁ
బడినిత్య మొకమాడ భర్గుచేఁ గొనుచు - నడరుచిఱుత్తొ(త్తు)ణయని బంటుబంటఁ
జన్న పురాతనశరణులబంట - నున్ననూతన భక్తయూథంబుబంట
నిటమీఁద శివుఁగొల్చి యీప్సితార్థములు - పటుతరంబుగఁగాంచు భక్తులబంట
ననుచు భక్తులచరిత్రాంకన లిట్టు - లనురక్తిఁదిరుపాట లమరఁబాడుచును
వింతవేడుక వుట్ట వినుతి సేయుచును - నంతంతఁజాఁగి సాష్టాంగంబు లిడుచు
మ్రొక్కుచుఁగరములు మోడ్చుచు“మీరె - దిక్కునుదెసయును దేవ!” మాకనుచు
[4]మీబంట మీ దూత మీ డింగరీఁడ - మీ బిడ్డ మీ పన్న మీ లెంకవాఁడ
మీ దత్తి [5]మీ ప్రాఁత మీ ధర్మకవిలె - మీ దాసి ననుఁగావరే దయతోడ”
ననుచు నంబన్న భక్తావలిఁజేర – వెనుక నంతంత నవ్విభుఁడేఁగుదేర
నభయార్థి యగునంబి నట్ల కైకొనుచు - నభవున కెదురేఁగి యందఱు మ్రొక్క
మిఱుమిండనయనారు మెఱవణి మెచ్చి - కఱకంఠుఁడాభక్తగణసహితంబు
కైలాసవాసులఁగాఁజేసె; నంబి - భూలోకమునను సల్లీలతో నునిచెఁ
గావున భక్తుఁడు గర్వింప భక్తి - భావన కెక్కునే బసవకుమార!
అని యిట్లు మాచయ్య యతిభక్తియుక్తిఁ - జనిన సద్భక్తుల చరితము ల్దెలిపి
బుద్ధులు నీతులుఁబోలంగఁ జెప్పి - పెద్దెన గర్వంబుపెల్లు మాయించి
మెఱుఁగులఁగన్నులు మిఱుమిట్లువోవ - వఱలెడు రత్నపర్వతము లత్యర్థి

  1. కుర్పి; నెఱిఁగికొల్చిన తిరుకురుబులి
  2. తిరువూరి
  3. చిఱువురి
  4. మీ దూత మీ బంట మీడింగరీఁడ 1 మీదయలోవాఁడ మీ ప్రాంతవాఁడ
  5. మీ పన్న