పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

139

“వాకిటికాఁపులవారల మొఱఁగి - యోకాఁప! నీ వెట్లొకో వచ్చి తిపుడు
సర్వమాన్యము నీకు గుర్వుగా నిత్తు - శర్వుభక్తుండవై చరియింపు” మనుడుఁ
“దనకు [1]నొమ్మదుభక్తి తన వంశమందు - మునుభక్తు [2]లెవ్వరుమనరిట్టు” లనుడు
“మనుపఁగ మాపూఁట మఱియట్లుఁగాక - ధన మిత్తు మన మిత్తుఁదన రాజ్యమిత్తు
నొడఁబడు” మనుడు సర్వోపాయములను - నొడఁబడకున్న మహోగ్రతతోడ
జళిపించి యసమనిశాతఖడ్గమునఁ - దల ద్రెవ్వ వ్రేయుచోఁదత్‌క్షణమాత్ర
హరుఁడు ప్రత్యక్షమై 'యడుగడ్గు' మన్న - "వరమూర్తి! నీ యిచ్చువరము లేనొల్ల
నంగద భక్తుండవగు” మంచు శివుని - లింగసహితుఁజేసి లీలమైఁబ్రమథ
గణవంద్యు సద్భక్తిగతిఁజూపి ప్రమథ - గణమూర్తియై యున్న గణపాలుబంట.

కుమ్మర గుండయ్యగారి కథ


పరగిన [3]యప్పెనుపట్టపులూరఁ - దిరునీలకంఠ దేవరగుడి కేఁగి
యొక్కనాఁడేతెంచుచున్నెడ రాత్రి - గ్రక్కునఁ జీకటిఁ గానంగలేక
వెలఁది యొక్కతె హర్మ్యతలమున నుండి - యిల నెత్తి చల్లుచో నెంగిలినీరు
పైనిండ "హరహరా! ప్రాణేశ" యనుడు - మానిని యేతెంచి మహిఁజాఁగి మ్రొక్కి
యట తోడుకొనిపోయి యభ్యంజనాది - పటుతర సత్క్రియా పరిపూర్ణుఁజేసి
క్షమఁగొని యనుచుడుఁజనుదేరఁ[4] దడవ - రమణి "వారాంగనార్థము సిక్కి” తనుచుఁ
గట్టుగ్రమునఁబతిఁగవయకున్నెడను - "అట్టేల డాయ ర” మ్మని కొంగువట్టి
తరళాక్షిఁదిగిచిన “దన్ను ముట్టినను - దిరునీలకంఠ దేవరయాన” యనుడు
నాసతి నంటక యట్లకాకనుచు - బాసతోడన యెను(c?) బదియేండ్లు సలుప
నప్పరముఁడు భక్తుఁడై వచ్చి యొక్క - గప్పెర నేనిచ్చి క్రమ్మఱవచ్చి
యట్ల కప్పెర యదృశ్యము సేసి యడుగ - నెట్లును గానక యింతియుఁబతియు
వడవడ వడఁకుడు వరతపోమూర్తి - "వెడమాటలను బోను వేయేల నమ్మఁ
గప్పెర[5]గొనకున్న గాంతయుఁబతియుఁ - జెప్పిన శపథంబు సేయుఁడు వచ్చి(డటంచు?)
కుంభిని జనులెల్లఁగూడి చూడంగ - గంభీరజలములఁగామినిఁబతిని
దండి గుండముముంపఁ దత్‌క్షణమాత్ర - మిండప్రాయంబులై మీఁదికి నెగయ
నటమున్న ప్రత్యక్షమై ధరనిల్చి - నిటలాక్షుఁడతిదయాన్వీతభావమున
నెప్పటట్టుల భువి నెను(c?)బదియేండ్లు - నొప్పార సుఖలీల నునుప మీఁదటను
మండితానంద ప్రమథ వైభవమున - నిండారు కుమ్మరగుండయ్యబంట.

  1. నోవదు, మోవదు
  2. లెన్నఁడు
  3. యప్పె (గుహిప్పరిగె), యన్-టూర
  4. నిచట
  5. గొనిరండు