పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

బసవపురాణము

నందెలు మ్రోయ మోక్షాంగన డాయ - సందేహ [1]ముడుగ నాశ్చర్యంబు [2]దొడుగఁ
జూపఱు గీర్తింప సురలు శంకింపఁ - దాపసి వీక్షింపఁ దండ్రి మైవెంపఁ
దల్లి గౌఁగిలిసాఁపఁ ద్వరితంబు దోఁప - ముల్లోకములుఁ జూడ ముద్దు దుల్కాడఁ
బఱతెంచె సుతుఁడు; నప్పాటనీశ్వరుడు - కఱకంఠుఁడజుఁడు మాకాంతుడుగ్రాక్షుఁ
డక్షరుం డా సిరియాలుకట్టెదుర - నక్షణంబునన ప్రత్యక్షమై నిలువ
నంతలో [3]సిరియాలుఁడతివయు సుతుఁడు - నంతంత ధరణి సాష్టాంగులై మ్రొక్కి
కలగని మేల్కన్నకరణి నద్భుతము - దళుకొత్తఁ జెలగి కీర్తనలు సేయఁగను
"శ్రీశ! వాణీశ! సురేశ! సన్ముని గ - ణేశ దిశాధీశు లెలమి నంకింప
నా రుద్రగణములు నా పురాతనులు - వీరభద్రాదులు సేరి కొల్వంగ
సద్భక్తు లతులితోత్సవలీలఁ దనర - నద్భుతాక్రాంతాత్ములై [4]నరుల్వొగడ
నలరి చందననంగ నాప్తవర్గంబు - నలతిరువెంగాణి'నంగఁ దత్సఖుల
నంచితమతి సిరియాలు సీరాలుఁ - గంచేడువాడలుఁ గైలాసమునకుఁ
బ్రవిమలకనకదివ్యవిమానపంక్తి - దివిఁదేజరిల్ల నద్దేవదేవుండు
గొనిపోయెఁ, గైలాసమున సిరియాలుఁ - డనుపమప్రమథగణాస్థానమందు
భవుఁ జూచి తనుఁజూచి ప్రమధులఁజూచి - భువిఁదనపెట్టిన పుత్త్రునిఁ జూచి
“పుడమిఁబుత్త్రునిఁజంపి మృడునిచే మగుడఁ - బడసి కైలాసమేర్పడఁ జూఱగొనిన
యిటువంటివాఁడెవ్వడేఁ దొల్లి యిపుడు - నట యిట గలఁడె నా యట్టి భక్తుండు
ఏనకా” కని మదినెంతయుఁగ్రొవ్వి - తా నహంకారించి తలఁపంగఁదడవ
చిఱునవ్వు నవ్వుచు శివుఁ డది యెఱిఁగి - 'చిఱుతొండ'రమ్మని చెయివట్టికొనుచు
నిమ్మహీతలమున కేతెంచి యపుడ - క్రమ్మఱ నిమ్మవ్వకడ నిల్వఁబడుడుఁ

నిమ్మవ్వ కథ


బడఁతియు బిట్టుల్కిపడి సంభ్రమమున - నడుగుల కెరఁగి పాదాబ్జముల్ గడిగి
యంగన ప్రచ్ఛన్నలింగమూర్తులకు - సాంగోచితక్రియాభ్యర్చనల్ సేసి
పంచభక్షంబులుఁబాయసాన్నాదు - లంచితప్రీతిఁగావించునయ్యెడను
భువిఁబథిశ్రాంతులుఁబోలె సెట్టియును - శివుఁడును వెడ నిద్ర సేయుచున్నెడను
నిమ్మవ్వ యర్ఘ్యపణ్యమ్ములకేఁగఁ - గ్రమ్మన గోవులఁ గాచి బాలుండు
వలసి యాఁకొని వచ్చి "యమ్మమ్మ!” యనుచుఁ - దలుపు [5]గఱ్ఱనూకితల్లి లేకున్న
నటయిట వరికించి యందొక్కబూరె - కుటిలాత్ముఁడై పుచ్చికొని నమలంగ

  1. మణుఁగ
  2. దొణఁగ
  3. జిఱుతొండఁ
  4. నరుల్చూడ
  5. గ్రక్కున