పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చతుర్ధాశ్వాసము

119

నంతటిలోన నిమ్మవ్వ యేతెంచి - యంతంతఁ 'జీ! కుక్క' [1]యని యిల్లుసొచ్చి
“పడుచు వాపముచేసె మృడునోగిరములు - [2]దొడికిలి తినె శివద్రోహి వీఁ"డనుచుఁ
బచ్చిచెక్కలఁ దలఁబగులంగనడిచి - చచ్చినపీనుఁగు జఱజఱ నీడ్చె
అననేల? పుత్త్రమోహంబు సీమంత - యును లేక కొడుకు చా వొరులెర్గకుండ
గాడిలోపల వైచి కసువుపై డిగిచి - వేడుక మదిఁదులుకాడంగ మఱియుఁ
బాకయత్నము సేయ బాలునిచావు - నేకాంతమున శివుఁడెఱిఁగింపఁ దలఁచి
"చిఱుతొండ! చూచితే! చిత్ర మివ్వనిత - తఱుసంటి [3]యాఁకలి ధరియింపలేక
క్రమ మెర్గఁ డొకబూరె గ్రక్కున డిగిచి - నమలెనో నమలఁడో నాతి వీక్షించి
'పాకమింతయు వృథాపాకంబుసేసె - యీ కుక్క ద్రోహి వీఁడేల నా'కనుచు
నఱిముఱిఁ బట్టి నిజాత్మజుఁ జంపి - జఱజఱ నీడ్చి యా చక్కటి వైచె
నదె చూడు” మనుచుఁ బాదాంగుష్ఠమునను - బొదివిన కసువెల్ల బోవనూకుడును
జూచి శిరఃకంప మాచరించుచును - నా చిఱు[4]తొండఁ డత్యాశ్చర్య మందె
నంగన వాక ప్రయత్నాంతమందు - జంగమములకు మై జలకంబు[5] సేసి
యతుల లింగోపచర్యల నర్చలిచ్చి - యతివ వడ్డించు నయ్యవసరంబునను
నింతిపుత్త్రునిఁజంపు టెఱుఁగనియట్ల - యంతకాంతకమూర్తి యప్పు డిట్లనియె
“ఇంతి! నీ పుత్త్రుఁడా యింతకమున్ను - నెంతయు నాఁకొని యిట సీరిచీరి
యెక్కడ వోయెనో? యెట్లున్న వాఁడొ? - అక్కటా! డస్సెఁ గదమ్మ! బాలుండు
కరుణమాలినయట్టి కాంతవు గదవె? - హరహర! చెయ్యాడ దారగింపంగఁ
బెంపమే కానమే బిడ్డలఁ దొల్లి - యింపౌనె కీడు మేలింట నేమేని
వండినఁ దిన; నెట్టివారైన శిశువు - లుండంగఁ దార కైకొండురే యిట్లు?
కనికరం బింతయు మనసున లేక - వనిత! మా కేటికి వడ్డించి తవ్వ!
పసిబిడ్డ లుండంగఁ బాడిగాదిట్లు - మసలక సుతుఁ బిల్వుమా యౌల నివల”
ననవుడు "నట్లగు నగు నాఁటదాన - ననియె చూచెదవయ్య! యయ్య నీమాయ
లెఱుఁగుదు నెఱుఁగుదు నే బేలఁ గాను - కఱకంఠ! యిదియేల కథలువన్నెదవు
ననుఁజూచి [6]సిరియాలుఁ డని తలంచితివొ? -పనియు లేదారగింపక పోవరాదు
ప్రామిఁడి[7]యై మేడుపడియెడు దానఁ - గామి నీ వెఱుఁగవే కడయింటి పొడువ
కామించి సుతుఁ జంపి క్రమ్మఱఁ బిలువఁ - గామారి! నీ యిచ్చు కైలాసమొల్లఁ

  1. యనుచిలు
  2. దొడికిలెనే
  3. యాకటదరియింపలేక
  4. చిరియాలు
  5. లార్చి
  6. చిఱుతొండఁడని
  7. నై(మై) మైదుపడియెడు