పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50

బసవపురాణము

హర యమహర గజాసురహర సకల - సురహరాసురహర పురహర భృంగి
గజకర్ణశార్దూల కర్ణాశ్వకర్ణ - విజయఘంటాకర్ణ [1]వీరగోకర్ణు
లాదిగా బలసి సదైశ్వర్యలీల నాది - ప్రమథగణేంద్రావళి గొలువ
సనకసనందన సన్మునీశ్వరులు - ననుఁగులై [2]తమహృద[3]యాబ్జముల్ పూన్ప
నుపమన్యు వామదేవ పవిత్రపాణి - కపిల కణ్వాగస్త్య కౌశిక సుబల
శ్వేత దధీచి వసిష్ఠ [4]కణ్వాత్రి - గౌతమ కశ్యప సూతానిలాత్మ
మాండవ్య హరిత మార్కండేయ పులహ - శాండిల్య వత్స కుత్స పులస్తిశక్తి
బాదరాయణ భృగు బక దాల్భ్య రురు శి - లాద మౌద్గల్య వర్ణాద శాకల్య
[5]గర్గ శౌనక [6]చతుష్కర్ణమృకండు - భార్గవాంగిరస విభాండక శునక
మైత్రేయ బల్లకి మంకణ చ్యవన - మిత్రావరుణ నారదాత్రిసౌవర్ణ
పైలసుమంతుసుబ్రహ్మణ్య మంద - పాల సుమిత్ర రైభ్యక సత్య సుమహ
పర్వత జైమిని పౌలస్య గార్గ్య - దుర్వాసు లాదిగా సర్వ సన్మునులు
[7]వెలుఁగ నాశీర్వాద వేదనాదముల - నలరుచు నందంద యనుకీర్తిసేయ
సుర నర దనుజ ఖేచర సిద్ధ సాధ్య - గరుడ గంధర్వోరగ ప్రకరంబు
ద్వాదశాదిత్యు లేకాదశరుద్రు - లాది నవబ్రహ్మ లష్టవసువులు
సురపాగ్ని యమదైత్య వరుణగంధవహ - నరవాహ [8]హరదిశానాథయూధంబు
శ్రీవాగ్వధూనాథ జిష్ణులు నవిక - లావరణస్థులై యభయముల్ వేఁడఁ
దుంబురునారదాదులు సుగీతామృ - తంబున నెయ్యంబు దనర నోలార్ప
నంబికా[9]సహితుఁడై యాస్థానమంట - పంబునఁ బేరోలగంబున నున్న
శివదేవుఁ గనుఁగొని సిద్ధరామయ్య - యవిరళభక్తి సాష్టాంగుఁడై మ్రొక్కి
“విన్నపం బవధారు విశ్వలోకైక - సన్నుత!” మర్త్యంబు సద్భక్తజనులు
“ప్రమథలోకంబున బసవండు [10]గలఁడో- ప్రమథేశుకొలువునఁ బరికింపు” మనిరి
“బసవసంస్తుత్య! సద్భక్తైకదేహ! - యసలార నున్నరూపానతి” [11]మ్మనిన

శివుఁడు తన హృదయమున బసవనిఁ జూపుట


“నాలోక మీలోక మననేల బసవఁ - డేలోక[12]మునను లేఁ? డెల్లచో నుండుఁ
బ్రమథులయందు సద్భక్తులయందు - నమరంగ నా హృదయాబ్జకర్ణికను

  1. విమల
  2. నిజ
  3. యంబులఁ బూ
  4. కణాద
  5. గార్గ్య
  6. జతుకర్ణి
  7. వెలయ
  8. భవనిశా
  9. సహితమై
  10. కలఁడు
  11. మ్మనుడు
  12. మందు లేఁడెట్లు తలంపఁ