పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము

49

సిద్ధరామయ్య కైలాసమున కరుగుట


నజ [1]కాలబుద్ధ క్షయాంత[2]రజ్యోతి - నిజ[3] బలప్రియ యామ్యనీల రుద్రేశ(శ్వ?)
యీ(రే? )శాన శర్వ సర్వేశ భర్గ ప్ర - కాశ సురాధీశ గౌరీశ ధన్య
వామదేవ భవోద్భవ ప్రచండ ధర - వామదేవో(హో?)గ్ర సంవాహ పినాకి
ధాతృ విధాతృ హుతాశన శివ మ - హాతేజ సూక్ష్మలయ క్రూరదంష్ట్ర
క్షేమేశ [4]వికరణార్చిష్మంత దమన - భీమాభిధానోగ్ర పింగాక్ష [5]కర్తృ
విషధరానంత నివృత్తి నిధీశ - వృషభగణాధ్యక్ష విభు వాయువేగ
హరరత్నకర బభ్రు హంతాగ్నిదుఃఖ - కర సుఖకర [6]సుదుంబర కాలరుద్ర
హరిహరబ్రహ్మసౌమ్య స్వామి మృత్యు - హర భయానకహలాహల పరం[7]ధామ
వజ్రదేహావ్యయ వట రుద్ర దీర్ఘ - వజ్రదంత వియోగ వట విరూపాక్ష
సహనేశ శంభు పంచశిఖ నియోక్తృ - గుహ రుద్ర [8]బాధక గోపతీశాన
పింగ ళాసాధ్య మాతంగ రోహిత[9]సు - రంగ కపాలధర స్థూలరుద్ర
శాశ్వతే శోర్ధ్వకేశ త్రిదశేశ - విశ్వేశ చండేశ విత్తేశ వృషధ
రాక్షయరుద్ర కాలాగ్నిరుద్ర త్రి - యక్షఫణీంద్ర విచక్షులాదిగను
రుద్రచిహ్నలు గ్రాల రుద్రాత్ములైన - రుద్రగణాధీశ్వరుల్ సేరికొలువ
శ్రీనంది నందినాథానంద వృషభ - సానంద గోముఖ హయ[10]ముఖాభంగ
దండపా ణీశాన చండీశ [11]రుద్ర - రుండాభరణ రుద్ర పుండరీకేశ
పర్వతాభరణ దర్ప సుభద్రశర్వ - సర్వజ్ఞ సర్వాత్మ సర్వసంహరణ
దారుక రేణుక ధవళాక్ష వీర - వీరక వీరభద్రారూఢ భద్ర
త్రిజటి ధూర్జటి లోకవిజయాట్టహాస - నిజబల విషబల నీల నిశ్శంక
నీలలోహిత నిత్య నిష్కళ శాంత - కాల మహాకాల కాల కాలోగ్ర
రూప నిరూప విరూపాక్ష విశ్వ - రూప పుష్కళ శాంతరూప వృషాంశ
యుగ్రాక్షభర్గాసితగ్రీవపింగ - ళోగ్రకాయాతీత(?) యుత్తుంగవిముఖ
కరిముఖ నరముఖ కపిముఖ ద్విముఖ - శరభముఖాముఖోష్ట్రముఖ శార్దూల
ముఖ చతుర్ముఖ పంచముఖ సుముఖాష్ట - ముఖ నవముఖ దశముఖ షణ్ముఖైక
ముఖ సహస్రముఖ దుర్ముఖ వికటాక్ష - మఖహర విషహర [12]మలహర మృత్యు

  1. కలా
  2. గుణ
  3. విత
  4. కృత్య
  5. సదంబర
  6. ధాత
  7. ఘాతుక
  8. కు
  9. ముఖనంద
  10. రౌద్ర
  11. శిఖి, స్మర