పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

159


క్షీరాబ్దిలోపలఁ గ్రీడించు హంస
గోరునే పడియల నీరుద్రావంగఁ
జూతఫలంబులు సుంబించు చిలుక
భాతిఁ బూరుగుమ్రానిపండ్లు గన్గొనునె
రాకామల జ్యోత్స్నఁద్రావు చకోర
మాకాంక్ష సేయునే చీకటిద్రావ
విరిదమ్మివాసన విహరించు తేఁటి
పరిగొని సుడియునే బబ్బిలివిరుల
నెఱుఁగునే యల దిగ్గజేంద్రంబు కొదమ
యెఱపందిచనుసీక నెఱుఁగవు గాక ! పు. 55

సీ. మందార మకరందమాధుర్యమునఁదేలు
                 మధుపంబు వోవునే మదనములకు
    నిర్మలమందాకినీ వీచికలఁదూగు
                 రాయంచ సనునె తరంగిణులకు
    లలితరసాలపల్లవ ఖాదియై చొక్కు
                 కోయిల సేరునే కుటజములకు
    పూర్ణేందుచంద్రికా స్ఫురితచకోరకం
                 బరుగునే సాంద్రనీహారములకు

-భాగవతము.

పండితారాధ్యచరిత్రమును బద్యకావ్యముగా రచించినవాఁడగుటచే శ్రీనాథుని యితర రచనలలోఁగూడఁగొన్ని పద్యభాగములు పలుకుబళ్లు నీతనివి చేరినవి. 'పాక మింతయు వృథాపాకంబుచేసె - ఆవగింజంతబూది మైనలఁది కొనిన | వెలఁది గుమ్మడికాయంత వెఱ్ఱిపుట్టు' ఇత్యాదులు -