పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

123


కవులు ప్రయోగించిరి. 'పుడమిపుఁడున్ ధనాఢ్యుఁడును' - నన్నిచోడుఁడు; 'పుడమీశ్వరగొంకనృపతి భోగసురేంద్రా' -మను మంచిభట్టు నశ్వశాస్త్రము; 'పొడగాంచి యిదియుఁ గఱచెన్ ! బుడమీశ్వర దేహమనుచు' - నారాయణకవి పంచతంత్రము; ఇత్యాదులు పెక్కులున్నవి. కర్ణాటభాషలోఁగూడ నిది కలదు. 'తవనిధి, తవరాజు' ('తపోనిధి, తపోరాజు అనుటకు) మొ. తెలుఁగు కృతులలోఁ గాని శాసనములలోఁగాని నాకిది గానరాలేదు. ద్రవిడకర్ణాట ప్రబంధములలో నిట్టివి తఱచుఁగా గలవు. తక్కిన ప్రయోగములు నాకన్యత్ర కానరాలేదు. జీవగఱ్ఱ - ఈ పదమును చతుర్వేదసారమున సోమనాథుఁడు ప్రయోగించెను. ఇది 'యనింద్యగ్రామ్య (వైరిసమాస) మని పలువురందురు గాని నాకట్లు దోఁపదు. శ-ర-లో దీనికి జీవనౌషధము జీవాతువు' అని యర్థము వ్రాయఁబడినది. ఈయర్థమును సరిగాఁ దోపదు. జీవ =వీణ మొదలగువాని తంతి చక్కఁగా మ్రోఁగుటకుఁ గాను దానిక్రింద నుంచెడు కంబళిపీఁచు లోనగునది. దాని నుంచుటకుఁ గాను బెట్టినకఱ్ఱకు 'జీవగఱ్ఱ' యని పేరు. 'విపులతరంబగు వీణ దానది యెంత కారణంబగు జీవగఱ్ఱ యెంత' చతుర్వేదసారము. "శ్రుతికి నుత్కరంబు సూపఁ గవలయుచోఁ జెవిత్రాడు బిగియించు జీవగఱ్ఱ” క్రీడాభిరామము.

పు. 144- అభిమానకత్తె ఈ పదము క్రొత్తగాఁ గానవచ్చినది. శ్రీనాథుఁడు గూడ నిట్టిపదములఁ బ్రయోగించినాఁడు. 'అన్న మీయన్న కోపగాఁ డౌనొ కాఁడొ', - కాశీఖండము; 'కొడుకుఁ గాంచినట్టియ కోపకత్తె' - క్రీడాభిరామము

పు.119- 'సద్భక్తసమూహి' ఇత్యాదులు. నన్నిచోడఁడు నిట్లు ప్రయోగించెను. 'శారదనీరదసమూహిచాడ్పునఁబోలెన్', సితచ్ఛదసమూహి' :- కుమార సంభవము; దశమాశ్వాసము.

కర్మధారయమున మహచ్ఛబ్దము - పు. 12- 'ఇది సుమహత్తత్వము', పు. 225 - 'ప్రోద్గత సూత్రమహద్గురుపుత్ర, మండలి లోభవన్మహదాజ్ఞ' - 'పండితా. - ఇట్టి వింకను గలవు. కర్మధారయసమాసమున 'మహత్' 'మహా' అని మాఱవలసి యుండఁగా నీతఁడు 'మహత్' అనియే షష్ఠీసమాస మందుంబోలె