పుట:బసవపురాణము (పాల్కురికి సోమనాథుఁడు).pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

బసవపురాణము


గలవు. ఆంధ్రవ్యాకరణకర్త లవి లేవనుట యసంగతమని నా తలంపు. ప్రాచీనలేఖనములందు వర్గద్వితీయ చతుర్థాక్షరములుగా నున్నవానిని నేఁటి పరిశోధకులాంధ్రమున నవి లేవనునమ్మకముచే వర్గప్రథమ తృతీయాక్షరములుగా సంస్కరించుచున్నారు. ద్రాభ, జఱభి, వజ్జలు మొదలగు వానిఁజూడఁదగును. సోమనాథుఁడే :

కంభకట్లను మేలుకట్లను బొలుచు- గంభీరపుష్పకాగారంబునందు - అని 'కంభ' పదమును ప్రయోగించెను. మఱియుఁ బెక్కు శాసనములలోను గలదు.[1]

ద్రాభఛందోవిరుద్ధంబాదియగున- లాభప్రలాపోక్తి లాఘవంబనక. - పండితా.

చౌదళాబ్జము :- ఇది చౌసీతిబంధములు, చౌషష్టికళలు, చౌపదము, చౌపుటము అను పదములవంటిది. ముల్లోకవంద్యుఁడు ఇత్యాదులు-అనంతుఁడు:

గీ. “మొదలి తెలుఁగుపై సంస్కృతపద మొకండుఁ
     జరగ లోకరూఢిని సమాసంబు చొరదు
     పూని ముజ్జగంబులు ననఁబోలుఁగాని
     యతఁడు ముజ్జగద్వందితుఁ డనఁగఁ జనదు”

అనెను. కాని, సోమనాథుఁడిట్టిపదములను బలుచోట్లఁ బ్రయోగించెను. తత్కాలపు శాసనకావ్యములందును నిట్టివి గానవచ్చుచున్నవి. "ముల్లోకవిభుండు సక్రి” ఓపిలి సిద్దిశాసనము. [2]నిత్యనేమము, నిత్యపడి మొ. ఈ పదములను మఱికొందఱు కవులును బ్రయోగించిరి. నిత్య వేఱుగాఁ గూడఁ గలదు. నాఁటి శాసనములందును 'నిత్యపడి, దివసపడి' ఇత్యాదులు గలవు.[3] పుడమీశ- దీనిఁగూడఁ బలువురు

  1. దక్షిణ హిందూదేశ శాసన సంచయము. IV నెం. 1378 చూ.
  2. చూ. ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక.
  3. దక్షిణ హిందూదేశ శాసన సంచయము. IV నెం. 1020 చూ.