| ఏ ముండ యెడ బాపెనే | |
ఇందు మొదటిది మహద్వాచకము దాసరిబోడి, వైజ 4-32. రెండవది మహతీవాచకము
బోడి శబ్దమునకు మహతీవాచకమున ప్రబోధచంద్రోదయ ప్రయోగ మొకటియే యున్నది.
పూఁబోఁడి-సమాసములో బోడి శబ్దము గలదు. కాని ఇది సార్థబిందుకము. "బహువ్రీహిని స్త్రీవాచ్యం బగుచో నుపమానంబు మీది మేనునకుఁ బోడియగు" అని సూరి (సమా 23సూ.) నేటివ్యాకరణములో "బోఁడి"లో అరసున్న యున్నది గాని - సూరి సూత్రాంధ్రవ్యాకరణమున "మేనుర్బోడి స్యాత్" అని నిరనుస్వారముగా నున్నది.
| పూబోడిలోని బోడి విశేషణము | |
మనవి పత్రము మి.స. మనవిపత్రము రాజులకు విన్నవించెడి పత్రికారూపమైన మనవి మాటలచే కానిది అని యర్థము.
గీ. | అనుచు మనవిపత్ర మర్పింత | ప్రబోధ (2-52) |
ఈ శబ్దము సూ.ని. లో లేదు.
ముండ వి ఈ పదమునకు 1 విధవ, 2. దాసి, 3. ఉంపుడుకత్తె, 4. ధూర్తురాలు; వంచకురాలు అను నాలుగర్థములు సూ.ని. లో గలవు. వానిలో ఇందు 4వ యర్థమున "ఏ ముండ యెడబాపె" (3-3) అను ప్రయోగము చూపబడినది. (సం 6 పుట 357)
మృద్బిందులు సం.వి.అ. పుం, మట్టికలిసిన నీటికణములు మృద్బిందులు దాల్చి 2-10 (ఇది సూ.ని.లో లేదు)
లక్కముద్ర వి లక్కతో ముద్రవేసిన పత్రము, ఈశబ్దము సూ.ని.లో లేదు.