పుట:ప్రబోధచంద్రోదయము.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బృసి యనగా ఋషుల యాసనము. ఇది ఈకారాంత స్త్రీలింగశబ్దముగాన 'బృసీ' అను రూపము వచ్చినది. పైప్రయోగము బృసీశబ్దము ఈకారాంతమని నిర్థారణ చేయుచున్నది.

4. వారణసి — దీనికి సరియగు రూపము వారణాసి

“ఈ వారణసిని”యని (2-5)లో గలదు.

5. సుహృత్తు (5-53)

సుహృత్ శబ్దము తకారాంతము
‘హలంతంబు ప్రథమైక చనాంతతుల్యం బిందు నామంబగు
'ఉగాగమంబును ద్విత్వంబును దుది హల్లునకగు" (తత్సమ.67,68)

పై సూత్రములచేత సుహృత్ శబ్దమునకు సుహృత్తు అను రూపము వచ్చినది.

ఛందస్సు

గద్యపద్య సంఖ్య

1-ఆ. 87
2-ఆ. 81
3-ఆ. 86
4-ఆ. 72
5.ఆ. 117
— — — —
       443
— — — —

యతివిశేషములు

ఉపసర్గయతి

“స, మర్థు లీకృతిరాజనిర్మాణమునకు" (1-25) సమ్ అర్థ — సమర్థ. ఇచట సమర్థ శబ్దమునకు వ్యంజనయతి.

"ని, ర్ణయమతి గ్లేశపంచక పరాజ్ముఖుఁడయ్యె" (5-46) ఇచట పరాక్ శబ్దమునకు వ్యంజనయతి. నన్నయ దీనికి వ్యంజనయతి పాటించినాడు. "రక్కసు