పుట:ప్రబోధచంద్రోదయము.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్ప్రేక్ష

చ.

జలకము మూర్ధ్ఖ్నచంద్రసుధ షట్కమలంబులు బూజధూప ము
జ్జ్వలతరబోధవాసననివాళి సుషుమ్నవెలుంగుసౌఖ్యముల్
తలఁపున నీగి బోనము సదానత నాదము ఘంట గాఁగ ని
ష్కలుషత నీయనంతవిభు గంగన గొల్చు నిజాత్మలింగతన్

1-17

ఇందు శివపూజాసమయమున శివయోగానుభవము బ్రహ్మానందసంధాయి యగు యోగానుభవముగా ఉత్ప్రేక్షింపబడినది.

కవితారీతి

శైలి

“శైలి' యనుపదము ఏ సంస్కృతాలంకారికులు వాడలేదు[1]. రీతి యని వాడిరి. కాని తెలుగున ప్రాచీనకాలమున నీపదము ప్రయుక్తమైనది. పండితారాధ్యచరిత్రలో పర్వతప్రకరణమున నీశైలిపదము ప్రయుక్తమైనది.

ద్వి.

చరితంబులును శ్రీ బసవపురాణంబు
నేలలు వెట్టంగ నింపు సొంపార
శైలి మై గ్రాలుచుఁ జదివెడివారు.

(పుట 488)

(1939 ముద్రణము.)

ఈ ప్రయోగము క్రీ.శ. 1200 నాటిది కావున లభ్యమైన ప్రయోగములలో ప్రాచీనతరము.

ఈ పదము నేటిసాహిత్యవిమర్శకులందఱును వాడుచునేయున్నారు.

ఈ జంటకవుల రచనారీతి యత్యంతహృద్య మైనది. ప్రత్యేకవిశిష్టత గలది. దీనిని గూర్చి ప్రసిద్ధవిమర్శకులగు కీ.శే. టేకుమళ్ల అచ్యుతరావుగారి

  1. ఈ పదమును గూర్చి పింగళివారి ఆంధ్రవాఙ్మయచరిత్రలో గలదు. తెలుగున నిది కావ్యములలో శ్రీనాథుని కాలమునుండి యున్నదని శ్రీ నాగళ్ల గురుప్రసాదరావుగారు నిరూపించిరి. (చూ. కలగూరగంప - ఆంధ్రవాఙ్మయచరిత్ర, భారతి - (సెప్టెంబరు 1976 పుట 58))