పుట:ప్రబోధచంద్రోదయము.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నీటి చందమున అంటిఅంటకయుండునట్లు యోగివలె జీవితము సాగించెనని యీగ్రంథమున నిట్లు వర్ణితమైనది.

సరిలేనినీతిచాతురిచేత రాజ్యతం
                          త్రంబును నడిపిన నడుపుగాని
యనిశంబు పుష్పచందనవనితాదిసౌ
                          ఖ్యంబుల నందిన నందుగాని
సంగీతసాహిత్యసరసవిద్యావినో
                          దంబులఁ దగిలిన దగులుగాని
స్వామిహితాసక్తి సదనవనాస దనుశా
                          సనలీల జరపిన జరపుగాని
నీళ్లలోపలి సరసిజినీదళంబు
సరణి నిర్లేపుఁడైన సంసారయోగి
సందియము లేదు ప్రత్యక్షశంభుమూర్తి
యీయనంతయ గంగమంత్రీశ్వరుండు.

(1-18)

శివయోగానుభవము

గంగమంత్రి శివయోగానుభవ మిట్లు వర్ణితమైనది.

జలకము మూర్థ్నిచంద్రసుధ షట్కమలంబులు బూజధూప ము
జ్జ్వలతరబోధశాసననివాళి సుషుమ్నవెలుంగు సౌఖ్యముల్
తలఁపున నీగిబోనము సదా తననాదము ఘంట గాఁగ ని
ష్కలుషత నీయనంతవిభుగంగన గొల్చు నిజాత్మలింగతన్.

(1-17)

ఆత్మలింగమనగా గురుదత్తమైన లింగముగాక తాను స్వయముగా సంపాదించిన లింగము శివయోగరహస్యశేవధి (1-38)

శివారాధనతత్పరత

దగ్గుపల్లి దుగ్గన నాసికేతూపాఖ్యానమున గంగమంత్రి శైవాచారతత్పరత యిట్లు వర్ణితమైనది.