పుట:ప్రబోధచంద్రోదయము.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయ్యలరాజు, అయ్యల భాస్కర కవులు.

వీరిరువురును కలిసి “రెట్టమతము" ఆను జోతిశ్శాస్త్రమును పద్యములలో రచించిరి.

ఆధునిక యుగమున చాలమంది జంటకవులు[1] వెలసిరి. వారిలో సుప్రసిద్ధులు.

తిరుపతి వేంకట కవులు

1. దివాకర్ల తిరుపతిశాస్త్రి. 2. చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి

కొప్పురపు సోదర కవులు[2]

1. కొప్పరపు వేంకట సుబ్బరాయకవి. 2. వేంకట రమణకవి.

వేంకటరామకృష్ణకవులు

1. ఓలేటి వేంకటరామశాస్త్రి. 2. ద్వివేది రామకృష్ణశాస్త్రి

రామకృష్ణశాస్త్రి, వేంకటరామశాస్త్రికి మేనత్త కొడుకు. వీరు పీఠికాపురసంస్థానకవులు, శతావధానులు, గ్రంథకర్తలు.

వేంకట పార్వతీశ్వర కవులు

1. బాలాంత్రపు వేంకటరావు. 2. ఓలేటి పార్వతీశము.

వీరు పద్యకావ్యరచయితలగు కవులేగాక ప్రసిద్ధ నవలారచయితలు. ఇది వీరి ప్రత్యేకత.

శేషాద్రిరమణ కవులు

1 తిరుమల శేషాచార్యులు. 2. దూపాటి వేంకటరమణాచార్యులు

  1. జంటకవులను గూర్చి చూ.
    1. ఈయూణ్ణి వీరరాఘవాచార్యులు సంస్కృతమున జంటకవులు. భారతి ఫిబ్రవరి 1988.
    2. AAN Raju: Handbook of Pseudonymous Authors in Telugu (1974)
  2. వీరినిగూర్చి సంపూర్ణవివరములు నాచేత రచింపబడిన “కొప్పరపుసోదరకవులచరిత్ర" అను గ్రంథమును చూడనగును.