పుట:ప్రబోధచంద్రోదయము.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


3.శా.

 చండాంశుప్రభ! చిక్కతిమ్మయతనూజా! తిమ్మ! విధ్వస్తపా
షండం బైన త్రిలింగ భాగవత షష్ఠస్కంధకావ్యంబు నీ
కుం డక్కెం జతురాననత్వగుణయుక్తుల్ మీఱ వాణీమనో
భండారోధ్ధత చూరకారబిరుద ప్రఖ్యాతి సార్థంబుగన్.

సర్వలక్షణసారసంగ్రహము 1.210

అప్పకవీయము

4.సీ.గీ.

వలవదు భయంబు వారెంత వారలైన
నట్టివారలు మనకర్హమైనవారు
వారు నిరయంబునకుఁ గాపువచ్చువార
లనుచు బుద్ధిగఁ జెప్పె మార్తాండ(సుతుఁడు).

3.180

అని యుదాహరింపబడిన గీత పద్యమునకు పైనున్న రెండు సీసపాదములను కీ. శే. మానవల్లి రామకృష్ణ కవిగారు తమ కుమారసంభవము ప్రథమభాగము అనుబంధములో నిట్లిచ్చినారు.

సీ.

వారిధిశయనుఁ జెయ్యారఁ బూజింపని
                   ఖలు గట్టి పెడకేలఁ గట్టి తెండు
హరిమందిరమున కధీశుఁడై నడవని
                   హీనాత్ముఁ గాల్బట్టి యీడ్చి తెండు

(మలయ మారుతము సింగన్న షష్ఠస్కంధము.)

పై సీసపద్యములో రెండు పాదములు కవిగారి కెట్లు లభించినవో తెలియరాలేదు. కవులషష్ఠము వారు చూచి యుందురని పైదానిని బట్టి విశదమగుచున్నది, లేదా వేరొక లక్షణగ్రంథకర్త యెవడైన నుదాహరించెనేమో తెలియరాదు.[1]

  1. మానవల్లికవి రచనలు వుట 16. ప్రస్తుత పరిష్కర్త పీఠికా సహితము ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ప్రచురణ 1978.