పుట:ప్రబోధచంద్రోదయము.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్రకటనటద్భూత భయదశ్మశాన
నికటశృంగాటకనివహంబు లెపుడు
రచ్చపట్టులు మాకు రమ్యవరాస్థు
లెచ్చైన హారము లిందుబింబాభ
నృకపాలపాత్రిక నిండిన సురయు
నొకటఁ గ్రోలుచు....

(పుట 102)[1]

వివేకవిజయము

పై సంవాదములనుబట్టి సూరయకవి జంటకవుల రచన నెంతసన్నిహితముగా తూచా తప్పక యనుసరించెనో తెలియగలదు.

పై యనుసరణలను బట్టి యీ కావ్యప్రాశస్త్యము గ్రహింపవచ్చును.

శృంగారషష్టము లేక కవుల షష్టము

1.శా.

శ్రీరామామణి సీతనాథుని యురస్సీమ న్నిజచ్ఛాయ గ
న్నారం గన్గొని యాత్మ నన్యవనిషేర్ష్యం బూన దత్కంధరన్
హారం బున్పుచు నింకఁ జూడుమన దానౌటం ద్రపంజెందఁ జె
ల్వారున్ రాముడు బ్రోచుఁ గాత చికతిమ్మాధీశుతిమ్మాధిపున్.

(కవిసంశయవిచ్ఛేదము)

2.మ.

 తనతో నల్గిన వాణిపాదముల మీదన్ వ్రాల లేనెత్తి నొ
య్యన పాశ్చాత్యనిజాస్యతన్ముఖములం దన్యోన్య మొక్కప్డు చుం
బన మబ్బంగఁ జతుర్ముఖత్వము ఫలింపం జొక్కు పద్మాసనుం
డనవద్యాయురుదీర్ణుఁ జేయు చికతిమ్మాధీశుఁ దిమ్మాధిపున్.

(సర్వలక్షణసారసంగ్రహము. 1-297)

  1. వివేకవిజయము - యక్షగానములు సంపుటము 4 ఆంధ్రవిశ్వకళాపరిషత్ప్రకటితము. 1959.