ఈ పుట అచ్చుదిద్దబడ్డది
భార్యలవలన కామక్రోధాదులు వివేకాదుల జననము | మాయలేదు |
3 అహంకారుని భార్య పేరులేదు | 3 ఇందు మమకారి యను భార్యగలదు. |
4 జైన బౌద్ధ చార్వాకాది సంవాదము | 4 శైవ వైష్ణవ సంవాదము |
మోహునికి వివేకునికి యుద్ధము | వారిరువురకు యుద్ధము |
5 వివేకునకు ఉపనిషద్దేవి వలన ప్రబోధచంద్రుని జననము. | 5 నిరహంకారునికి శాంతివలన జ్ఞానదేవుని జననము |
దృశ్యకావ్యములు
యక్షగానములు
జగన్హాటకము శ్రవ్యకావ్యము కాని దృశ్యకావ్యములైన యక్షగానములలో వేదాంతపరమైన యక్షగానములుకలవు. అవి ప్రబోధచంద్రోదయానుసరణములే.
ముక్తికాంతాపరిణయము
పరమానందతీర్థరచితము ఈతడు క్రీశ 1680 ప్రాంతమునాడు. “సచ్చిదానందపురాధీశ్వరుడు తన పుత్రికయగు మోక్షకన్యకకు స్వయంవరము చాటించుట - వివిధమతాధిపతులును దేశాధీశులు విచ్చేయుట - మోక్షకాంత నొక్కొక్కరి నొక్కొక్కనెపమున రప్పించి అద్వైతవేదాంతమతస్థుడగు వివేకుని పెండ్లియాడుట నిందలి యితివృత్తము.
ముక్తికాంతావిలాసము
తరిగొండ వెంగమాంబ రచితము (1784-1868) జగదీశ్వరుడు మాయను వీడి ముక్తికాంతను బొందగోరి యామె మందిరమునకువచ్చుట విజ్ఞానకాంత (చెలికత్తె) తలుపుమూయుట - తలుపుకడ నావల నీవల నాయకానాయకుల సంవాదములు - మాయాశక్తి వైరాగ్యజ్ఞానశక్తులతో వాదించుట మున్నగునవి యిందలి ఇతివృత్తము.